Viral Video: వీడేవడండి బాబు.. ఒంటిపై నూలుపోగు లేకుండా లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లోకి..

|

Dec 30, 2024 | 9:22 PM

వైరల్‌ వీడియోపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రైళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చాలా మంది విమర్శించారు. మరికొందరు నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పటికీ ఇంటర్ నెట్ లో వేగంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వీడేవడండి బాబు.. ఒంటిపై నూలుపోగు లేకుండా లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లోకి..
Naked Man Enters Ladies Com
Follow us on

సెంట్రల్ రైల్వేలోని ఏసీ లోకల్ రైలు లేడీస్ కోచ్‌లో కలకలం రేగింది. ఒక వ్యక్తి బట్టలు లేకుండా కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. దీంతో మహిళలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. అరుపు, కేకలు వేయడంతో టీసీకి ఫోన్ చేశారు. ఆ తరువాతి స్టేషన్‌ రాగానే సదరు వ్యక్తిని టీసీ రైలు నుంచి బయటకు దించేశాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కాకుండా, సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద సంఖ్యలో వీడియోపై స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి బయల్దేరిన లోకల్‌ రైలు కళ్యాణ్‌ కు వెళ్తుంది. ఈ క్రమంలోనే రైలు ఘట్‌కోపర్‌ స్టేషన్‌లో ఆగగానే షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 4.11 గంటలకు ఘాట్‌కోపర్‌ స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలెక్కాడు. నేరుగా లేడీస్‌ కంపార్టుమెంట్‌లోకే ప్రవేశించాడు. దాంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అతడిని రైల్లోంచి దిగిపోవాలంటూ మహిళలంతా కేకలు వేశారు. కానీ, అతడు వినిపించుకోలేదు. రైల్లోంచి దిగేందుకు నిరాకరించాడు. దాంతో రైలు ఆపాలని మహిళలంతా గట్టిగా అరిచారు. మహిళల అరుపులు విని పక్క బోగీలో ఉన్న టీసీ అక్కడికి చేరుకున్నాడు. నగ్నంగా ఉన్న యువకుడిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయినా అతడు నిరాకరించడంతో టీసీ అతడిని పక్క స్టేషన్‌లో బలవంతంగా కిందకు తోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్‌ వీడియోపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రైళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చాలా మంది విమర్శించారు. మరికొందరు నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అధికారుల విచారణలో కూడా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దాంతో అతడికి దుస్తులు ఇచ్చి బయటికి పంపించారని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..