Murder attempt in Mobile Shop: దేశంలో ఎన్ని కఠిన చట్టాలున్నప్పటికీ.. కొంతమంది విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న గొడవలకే చంపే వరకు వెళ్తున్నారు. అలా అఘాయిత్యాలకు పాల్పడి జైలుపాలవుతున్నారు. తాజాగా.. ఓ మొబైల్ షోరూంలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య గొడవ తలెత్తడంతో.. ఓ వ్యక్తి కత్తితో హల్ చల్ చేశారు. కోపంతో కత్తితో సహా ఉద్యోగులపై విరుచుకుపడ్డాడు. ఇద్దరిని కత్తితో నరికి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని.. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మొబైల్ షోరూంలో పనిచేస్తున్న సెల్వంగా గుర్తించారు. తోటి ఉద్యోగులతో విబేధాల కారణంగా పలు సందర్భాలలో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గొడవల నేపథ్యంలో తన వెంట వేట కత్తి తెచ్చుకున్న సెల్వం.. షాపులో కాసేపు కూర్చున్నాడు. అనంతరం షో రూమ్‌లో ఉన్న తోటి ఉద్యోగులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వీడియో..
Also Read: