రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిలుకకు MRI స్కాన్.. రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..!

నరాలను బలోపేతం చేయడంలో అక్యుపంక్చర్ సహాయపడుతుందని డాక్టర్ కత్యాల్ చెప్పారు. చిలుకకు ప్రతిరోజూ 'ఫోటోథెరపీ' కూడా ఇస్తున్నారు. నొప్పి నిర్వహణలో ఇది ఒక ఆధునిక పద్ధతి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. గాయాలను త్వరగా తగ్గించేందుకు, కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుందని వైద్యులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిలుకకు MRI స్కాన్.. రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..!
Parrot With Neurology Issue

Updated on: Jun 22, 2025 | 9:29 AM

ఒక చిలుకకు MRI స్కాన్ చేశారు. ఈ టెస్ట్‌ ద్వారా చిలుకకు నాడీ సంబంధిత వ్యాధి ఉందని గుర్తించిన వైద్యులు.. దానికి అక్యుపంక్చర్ ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. ఈ అరుదైన సంఘటన ముంబైలోని చెంబూర్‌లో వెలుగు చూసింది. అనారోగ్యంతో ఉన్న ఓ చిలుక ఒక కార్ వాషర్ కారు కింద పడింది. అది గమనించిన కారు డ్రైవర్‌ వెంటనే దాన్ని పశు వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు.. ఈ క్రమంలోనే చిలుకను పరీక్షించిన పశు వైద్యులు దానికి అటాక్సియా ఉందని నిర్ధారించారు.. ఇది నాడీ సంబంధిత సమస్య. ఆ తరువాత ఏం చేశారంటే..

కార్‌ వాషర్‌ కారు కింద పడిన చిలుక శరీరమంతా వణుకుతూ కనిపించిందట. అది తన మెడను వంచి నీరు కూడా త్రాగలేకపోయిందని, ఆహారాన్ని కూడా కొరకలేకపోయిందని కార్‌ డ్రైవర్‌ చెప్పాడు. వెంటనే పశు వైద్యులకు చూపించగా,.. డాక్టర్ దీపా కత్యాల్ ఈ చిలుకకు చికిత్స చేశారు. ఎక్క్‌ రే సహా దానికి అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల ఆధారంగానే చిలుక శరీరంలోని వణుకు అటాక్సియాను సూచిస్తుందని, ఇది నాడీ సంబంధిత సమస్య కావొచ్చునని భావించారు. మరింత లోతైన సమాచారం కోసం చిలుకకు MRI స్కాన్ చేశారు. చిలుక మెదడు, వెన్నుపాము స్కాన్ చేశారు. అయితే, ఈ స్కాన్ మనుషులకు చేసే యంత్రంలోనే తీశారు. చిలుకను MRI మెషీన్‌లోకి తీసుకెళ్లడానికి ముందుగా దానికి అనస్థీషియా ఇచ్చారట.

ఈ స్కానింగ్‌లో గాయపడిన చిలుక కండరాలు, నరాల మధ్య సమన్వయ లోపం కనిపించింది. చిలుక తోక ఎముక కూడా దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. వెన్నుపాములోని నరాలు దెబ్బతిన్న చోట వాపు కూడా ఉందని గుర్తించారు. దాంతో వెంటనే చిలుకకు చికత్స మొదలు పెట్టారు. పెయిన్‌ కిల్లర్స్‌ ఇస్తూ ఫోటోథెరపీ, అక్యుపంక్చర్ ఇచ్చారు. నరాలను బలోపేతం చేయడంలో అక్యుపంక్చర్ సహాయపడుతుందని డాక్టర్ కత్యాల్ చెప్పారు. చిలుకకు ప్రతిరోజూ ‘ఫోటోథెరపీ’ కూడా ఇస్తున్నారు. నొప్పి నిర్వహణలో ఇది ఒక ఆధునిక పద్ధతి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. గాయాలను త్వరగా తగ్గించేందుకు, కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుందని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..