గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్ దేశం భారీ ఏర్పాట్లు చేసింది. గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు.. ఉత్సవ మండళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఊరువాడ బొజ్జ గణపయ్య సందడి మామూలుగా ఉండదు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అందరూ తమకు తోచినంత వినాయకుని ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులూ ఘనంగా పూజలు చేస్తూ.. ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అయితే, నవరాత్రులకు ముందుగా పిల్లలు ఇల్లిళ్లు తిరుగుతూ.. పందిరి,ఉత్సవాల కోసం చందాలు వసూలు చేస్తుంటారు. ఇళ్లు, ఆఫీసులు మాత్రమే కాదు..వచ్చిపోయే వాహనదారులను కూడా అడిగి ఆ వచ్చిన డబ్బుతో వినాయకుడిని పెడుతుంటారు. అదేవిధంగా ఇక్కడ కొందరు చిన్నారులు వినాయకుడి ఏర్పాటు కోసం ఎంపీ డా. మంజునాథ్‌ను డబ్బులు అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన పోస్ట్‌ను హేమంత్ విరాట్ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఎంపీ డా. మంజునాథ్‌ను కారుకు అడ్డుపడ్డ కొందరు స్థానిక పిల్లలు గణేష్ చందా అడుతున్నారు. గణేష్ కలెక్షన్ కోసం వచ్చిన ఆ పిల్లలకు సదరు ఎంపీ తన పర్స్‌లోంచి రూ.500లు నోటు తీసి ఇచ్చాడు.. పైగా బాగా చదువుకోవాలని కూడా చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియో చూడండి..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే వీడియో 6 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. వీడియో చూసిన నెటిన్లు ప్రతిఒక్కరూ దీనిపై స్పందించారు. ఒకరు వీడియోకు సూపర్ డాక్టర్ అని కామెంట్ చేయగా.. చాలా గొప్ప పనిచేశారు. అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..