Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ప్రధానంగా నెటిజన్లు ఫన్నీ వీడియోలను చూస్తుంటారు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగానే కొందరు యువకుల చేతికి బైక్ దొరికితే చాలు తెగ రెచ్చిపోతారు. అమ్మాయిలు, ప్రజల ముందు బిల్డప్ ఇస్తుంటారు. రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే, కొందరి స్టంట్స్ సక్సెస్ అయితే.. మరికొందరి స్టంట్స్ ఫెయిల్ అయి పరువు పోగొట్టుకుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా అలాంటి పరిస్థితినే ఫేస్ చేశాడు. ఈ ఫన్నీ స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోలో బైక్‌పై స్టంట్స్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. బైక్ నడుపుతూ అకస్మాత్తుగా ముందు చక్రాన్ని పైకి ఎత్తాడు. కానీ ఆ బైక్‌ను బ్యాలెన్స్ చేయలేక డబాలున కింద పడిపోయాడు. కొంతదూరం వరకు బండి అదుపు తప్పకుండా ప్రయత్నించినప్పటికీ.. చివరకు బండి బోల్తా పడిపోతుంది. ఆ వ్యక్తి హెల్మెట్ కూడా ధరించలేదు. అతనికి తీవ్రంగానే గాయాలైనట్లు వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఈ డేంజర్ స్టంట్స్‌ను చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో asikin_ali_07_g_k అకౌంట్‌లో షేర్ చేశారు. దీనికి రికార్డు స్థాయిలో 38 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే లక్షలాది మంది లైక్ చేశారు.
Also read:
Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!