సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు.. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యేవరకూ కంటికి రెప్పలా కావలాకాస్తుంది. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి. ఓ తల్లి తన పిల్లాడిని కాపాడుకోవడానికి శక్తిమాన్ గా మారింది.. ఇంటి పై కప్పు కూలిపోతున్న సమయంలో రెప్ప పాటులో తన బిడ్డను రక్షించుకుంది. ఈ ఘటన కంబోడియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కంబోడియాలోని నమ్ పెన్‌లో ఒక తల్లి తన ఇంటి పైకప్పు కూలిపోయే కొన్ని సెకన్ల ముందు తన బిడ్డను రక్షించిన భయానక వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం.. ఈ సంఘటన జూలై 3 న ఆ దేశ రాజధాని నగరం నమ్ పెన్‌లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక గదిలో పిప్ స్రే అనే తల్లి ఒక బిడ్డను ఎత్తుకుని మరో ముగ్గురు చిన్న పిల్లలతో పాటు నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో ఒక శబ్దం ఆ తల్లికి శబ్దం వినబడింది.. వెంటనే తన దగ్గర ఉన్న బిడ్డతో పాటు.. మరో ఇద్దరు పిల్లలతో ఆ గది నుంచి బయటపడడానికి పరుగెత్తడం ప్రారంభించింది. ఇంతలో ఆ తల్లికి బేబీ వాకర్‌లో విడిచిపెట్టిన తన బిడ్డ గుర్తుకొచ్చింది. అంటే రెప్పపాటులో బేబీ వాకర్ లో ఉన్న బిడ్డను తన దగ్గరకు సురక్షితంగా లాగుకుంది. అదే సమయంలో ఇంటి పై కప్పు కూలిపోయింది.
The #ceiling of a residence in Phnom Penh, #Cambodia, #collapsed in the living room. Luckily, the #mother inside the house acted quickly, picking up one child with one hand and holding a school bicycle having another child with the other. All her children were saved in the end. pic.twitter.com/aK9wXVsTvW
— Warm Talking (@Warm_Talking) July 18, 2023
తల్లి పిప్ స్రే మాట్లాడుతూ, “చిన్నారిపై ఇంటి పైకప్పు పడి ఉంటే చనిపోయేవాడు, పైకప్పు పడిపోవడం చూసి పారిపోవాలనుకున్నాను. అయితే ఏదో తట్టినట్లు తాను వెనక్కి తిరిగి చూశానని.. కనుకనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన పిల్లాడిని రక్షించుకున్నానని చెప్పింది.
ఈ ఘటనపై బిల్డర్లలో ఒకరు మాట్లాడుతూ, “ఇంటికి సంబంధించిన నిర్మాణంకి సంబంధించిన ప్లాన్‌లలో వాటర్ ప్రూఫింగ్ లేదు. దీంతో వర్షం కారణంగా పైకప్పు బలహీనపడింది. నాసిరకం నిర్మాణం కారణంగా ఇంటి పై కప్పు కూలిపోయింది అని చెప్పాడు. అంతేకాదు “ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసే సమయంలో ఇంటి నిర్మాణనికి సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కి జరిగినట్లుగానే ఇతర ఇళ్లకు కూడా జరిగే అవకాశం ఉందని.. కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బిల్డర్ హెచ్చరించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..