నిద్ర పోయిన వారిని మేల్కొలపాలంటే కాస్త ఆలోచిస్తుంటాం. అయితే, కొంతమంది మాత్రం ఇలాంటివి ఏవీ ఆలోచించకుండా నిద్రమత్తులో ఉన్న వారిని లేపేస్తుంటారు. హాయిగా నిద్ర పోయిన వారికి, నిద్రా భంగం కలిగిస్తుంటారు. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే.. తమ పిల్లల నిద్ర నుంచి లేపాలంటే మాత్రం తెగ ఆలోచిస్తుంటారు. మరి జంతువుల విషయానికి వస్తే, ఎలా ఉంటుంది, నిద్ర పోతున్న వాటిని ఎలా మేల్కొలుపుతారో తెలుసుకోవాలని ఉందా.. అయితే, కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఓ ఏనుగు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియోపై తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏనుగు పిల్ల మంచి నిద్రలో ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను @buitengebieden ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
వీడియోలో తల్లి ఏనుగు తన పిల్లని నిద్ర లేపలేకపోయింది. ఎంత ప్రయత్నించినా తన పిల్లను మేల్కొలపలేక ఇబ్బందులు పడింది. ఇందుకోసం జూ సంరక్షకులను సహాయం అడిగింది. ఎంతో క్యూట్‌గా అడగడంతో, జూ సంరక్షకులు కూడా ఫిదా అయ్యారు. దీంతో ఏనుగు పిల్లను మేల్కొలిపేందుకు సహాయం చేశారు. దీంతో జూ సంరక్షకులు వచ్చి గట్టి తట్టి లేపారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏనుగు పిల్ల లేచింది. దీంతో అంతసేపు తన పిల్లకు ఏమైందోనని భయడిన తల్లి ఏనుగు, ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయింది. ఏనుగు పిల్ల కూడా తన తల్లిని వెతుక్కుంటూ దగ్గరికి వెళ్లిపోయింది.
Mother elephant can’t wake baby sound asleep and asks the keepers for help.. pic.twitter.com/WTu07sDWLb
— Buitengebieden (@buitengebieden) July 7, 2022
ఏనుగు పిల్ల రియాక్షన్ సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ట్విట్టర్‌లో ఈ వీడియో 5.3 మిలియన్ల వీక్షణలను పొందింది. ఇది మాత్రమే కాదు, క్లిప్ కేవలం 47 సెకన్ల నిడివితో, దాదాపు 2.5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 31 వేల కామెంట్లు వచ్చాయి.