ఈ ప్రపంచంలో బ్రతికే ఏ జీవికైనా ఆశ ఉండొచ్చు కానీ, అత్యాశ ఉండకూడదు. మా జీవితం మా ఇష్టం అని మితిమీరి ప్రవర్తిస్తే.. లేని పోని అనర్థాలు వెంటాడతాయి. అందుకే పెద్దలు అత్యాశ అనర్థాలకు మూలం అంటారు. ఇది సమస్త జీవులకు వర్తించే సత్యం. అందుకు ఉదాహారణగా ఇప్పుడు మీకు ఓ దోమను చూపించబోతున్నాం. ఆడ దోమలకు రక్తమే ఆహారం. దోమల వల్ల మనుషులకు ఎన్నో ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తాయి. అయితే దోమలను ఎదర్కునేందుకు మనం అనేక చర్యలు చేపడతాం. దోమల జాతి సమాప్తం అనేది ప్రకృతి చేతిలో ఉంటుంది. అది మనం డిసైడ్ చెయ్యలేం. ఈ క్రమంలో దోమలు కూడా ఆహారం కోసం వచ్చామా? వాలామా? కడుపు నిండా రక్తాన్ని తాగామా? వెళ్లామా? అన్నట్టు ఉండాలి. కానీ ఓ దోమ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహారించింది. అత్యాశకు పోయి మనిషి రక్తాన్ని మితిమీరి తాగింది. చివరకు పొట్ట పగిలి చనిపోయింది.
ముందుగా వీడియో వీక్షించండి
By popular demand, here’s a shorter version of the exploding mosquitoes video pic.twitter.com/nRMiycFKqH
— Perran Ross (@MosWhisperer) March 24, 2020
పెర్రన్ రాస్ అనే వ్యక్తి తన రక్తం తాగుతున్న దోమను వీడియో తీశాడు. ఆత్రంగా రక్తాన్ని పీల్చిన ఆ దోమ.. కడుపు నిండిన తర్వాత కూడా పీల్చడం ఆపలేదు. చివరకు పొట్ట పగిలిపోయింది. ఇదే వీడియోను పెర్రన్ రాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా ఈ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన వారంతా ఆ రాకాసి దోమ రక్త దాహానికి అద్దం పడుతోందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: “మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు