Viral Video: ఓసి దీని వేషాలో..! వానరం దర్జ మామూలుగా లేదుగా.. ఇంతకీ ఆ ఫోన్‌లో ఏం చూస్తుందో తెలిస్తే..

|

Jun 20, 2024 | 4:29 PM

అంతేకాదండోయ్...ఆ కోతి చేతిలో మొబైల్ పట్టుకుని కాలు మీద కాలు వేసుకుని మొబైల్‌ని స్ర్కోల్‌ చేస్తూ దర్జాగా పడుకుని ఉంది. మనుషుల హుందాకు ఏమాత్రం తగ్గకుండా ఫోన్‌ని చూస్తూ ముఖంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా ఇస్తోంది ఆ వానరం. ఈ దృశ్యం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Viral Video: ఓసి దీని వేషాలో..! వానరం దర్జ మామూలుగా లేదుగా.. ఇంతకీ ఆ ఫోన్‌లో ఏం చూస్తుందో తెలిస్తే..
Monkey Using Mobile
Follow us on

ప్రస్తుతం ఎనిమిది ఏళ్ల పిల్లవాడి నుంచి ఎనభైయేళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్‌ఫోన్‌కు అలవాటు పడిపోయారు. ఈ మొబైల్ ఫోన్‌పై ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లుంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లతో ఇప్పుడు మనం హైదరాబాద్‌ నుండి అమెరికాలో కూర్చున్న వారితో స్నేహం చేయవచ్చు. ఇలా ప్రపంచం నలుమూలల ఎక్కడి వారైనా ఎవరితోనైనా ఎప్పడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. అందుకే సోషల్ మీడియాలో స్నేహితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కారణాల వల్ల చాలా మంది మొబైల్ స్క్రీన్ మీద నుంచి ఒక్క క్షణం కూడా కళ్లు తిప్పలేకపోతున్నారు. ఎప్పుడూ చేతిలో మొబైల్ స్క్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అందరి కళ్లు ఈ చిత్రానికి తగ్గట్టుగా ఉన్నాయి. కానీ ఈసారి సోషల్ మీడియా పేజీలలో తెలియని ఫోటో ఒకటి కనిపించింది. ఇక్కడ మరింత విచిత్రంగా కోతి ఒకటి మొబైల్ ఫోన్ వాడుతూ కనిపించింది. మంకీ మొబైల్‌ వాడుతున్న వీడియో ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియో బెడ్‌పై దుప్పట్లు, దిండ్లు వేసి ఉండటం కనిపిస్తుంది. ఒక కోతి ఆ బెడ్‌పై వేసివున్న దిండుపై తల పెట్టుకుని పడుకుని ఉంది. అది చక్కగా ప్యాంటు, షర్టు ధరించి ఉంది. కోతి గోల్డెన్ కలర్ కోల్డ్ షోల్డర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని కనిపిస్తుంది. అంతేకాదండోయ్…ఆ కోతి చేతిలో మొబైల్ పట్టుకుని ఉంది. కాలు మీద కాలు వేసుకుని చేతిలో మొబైల్‌ని స్ర్కోల్‌ చేస్తూ దర్జాగా పడుకుని ఉంది. మనుషుల హుందాకు ఏమాత్రం తగ్గకుండా ఫోన్‌ని చూస్తూ ముఖంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా ఇస్తోంది ఆ వానరం. ఈ దృశ్యం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ఆ కోతి ఇంత తీక్షణంగా మొబైల్ ఫోన్‌లో ఏం చూస్తుందో మాత్రం తెలియదు. కానీ, మొబైల్ ఫోన్ పై కోతికి ఉన్న శ్రద్ధ, ఆసక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో పోస్ట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వ్యూస్‌ సేకరించింది. లైక్‌లు దాదాపు 13 లక్షలకు పైగా వచ్చాయి. నెటిజన్ల రియాక్షన్స్‌తో కామెంట్‌ బాక్స్‌ నిండిపోయింది.

ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇలా వ్రాశారు, “కోతికి నాలాగే అదే ఫోన్ ఉంది. ఫోన్ కేసు కూడా అదే.” అని రాయగా, దానికి సమాదానంగా “ఈసారి మీరు అదే బట్టలు ధరించాలి,” అంటూ ఒకరు తన వ్యాఖ్యకు సరదాగా బదులిచ్చారు. ఈ విధంగా, ఈ వీడియో చుట్టూ రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..