ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు రావటం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు టమాటా కోయకుండానే ఇంటిల్లిపాదిని ఏడిపించేస్తోంది. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు. కొండెక్కి కూర్చున్న టమాటా రేటు ఎంతకీ దిగిరానంటోంది. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు టమాటా కొనటమే మానేశారు. ఈ క్రమంలోనే టమాటా ధరలకు సంబందించి అనేక రకాల మీమ్స్, జోకులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అంతేకాదు. టమాట దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా టమాటాలకు సంబంధించిన ఒక వైరల్ వీడియో హల్‌చల్ చేస్తోంది. వైరల్ వీడియోలో ఒక వానరం ఇంట్లోకి ప్రవేశించి టమాటాలు ఎత్తుకెళ్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒకరి ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉండటం కనిపించింది. ఇంట్లోని వారేవరూ కనిపించటం లేదు. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక కొండముచ్చు ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఎదురుగా ఒక ప్లాస్టిక్ బుట్టలో టమాటాలు, బంగాళదుంపలు వేసి ఉండటం చూసింది. ఆహా.. ఇక పండగే అనుకుంది ఆ వానరం. వెంటనే ఆ బుట్ట దగ్గరగా వెళ్లి కూర్చుంది. ఒక్కో టమాటా తీసుకుని తినటం మొదలు పెట్టింది. ముందుగా ఓ బంగాళదుంప నోట్లో పెట్టుకుంది.. కానీ, ఎదురుగా ఎవరో వచ్చినట్టుగా అనిపించింది. దాంతో ఆ కొండముచ్చు టమాటా చేతిలో పట్టుకుని అక్కడ్నుంచి పారారైంది. ఇదంతా ఎవరు వీడియో తీశారో తెలియదు గానీ, వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. టమోటా ధరలు హనుమంతుడికి కూడా తెలుసు నంటూ కొందరు నెటిజన్లు ట్విట్ చేశారు.
మార్కెట్‌లో టమోటా ధర ఎప్పుడు తగ్గుతుంది? అన్నదానిపై ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. దానికి బదులు టమాట ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికీ కొన్ని చోట్ల కిలో టమాట రూ.250-280 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో రూ.300 వచ్చే ప్రమాదం కూడా ఉంది. అధిక ధర కారణంగా, నేడు టమోటాలు విలువైన వస్తువుగా ఉపయోగించబడుతున్నాయి. అంతే హనుమంతుడికి కూడా ఆ ఖరీదైన కూరగాయ విలువ అర్థమైంది. దీంతో ఇంట్లోని వంటగదిలోకి దూసుకెళ్లి టమోటాలతో పారిపోయాడు అంటూ వేలకొద్దీ మీమ్స్‌తో ఈ వానరం వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియోను పన్నాషా03 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేసింది. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు దాదాపు 57 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 2 లక్షల లైక్స్ వచ్చాయి. అదే సమయంలో చాలా మంది వీడియోను లైక్ చేశారు. వారి స్పందనలు ఇచ్చారు. ఒక నెటిజన్ చాలా ఫన్నీగా ఇలా వ్రాశాడు, ‘చౌకైన వస్తువులను తినండి. ఖరీదైన వస్తువులతో పారిపోండి. ఇది బంగారమని ఇప్పుడు హనుమంతుడికి కూడా తెలుసు.’ మరొకరు, దేవుడా.. ఇప్పుడు టమోటాలు చాలా ఖరీదైనవి!’
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..