Viral Video: అయ్యో పాపం కోతి..! స్మార్ట్‌ ఫోన్‌కి ఎంతలా అలవాటు పడిందో చూడండి.. ఆనంద్ మహీంద్రా ఆందోళన!!

|

Apr 07, 2023 | 9:02 PM

అలాంటి జనాల మధ్యలో ఉంటున్న ఒక పెంపుడు కోతి కూడా స్మార్ట్‌ఫోన్‌కు అలవాటుపడింది..హాయిగా తన యజమాని పక్కనే కూర్చుని ఫోన్‌ ఆపరేట్‌ చేస్తూ తనకు నచ్చింది చూస్తుంది. ఈ ఈడియోను తొలుత క్యాన్‌వాస్ఎం సీఈఓ జ‌గ్దీష్ మిత్ర షేర్ చేశారు.

Viral Video: అయ్యో పాపం కోతి..! స్మార్ట్‌ ఫోన్‌కి ఎంతలా అలవాటు పడిందో చూడండి.. ఆనంద్ మహీంద్రా ఆందోళన!!
Monkey
Follow us on

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోష‌ల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన షేర్‌ చేసే వీడియోలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఆలోచనాత్మక సందేశాలు, ఆసక్తిరేకెత్తించే వీడియోలను అభిమానులతో పంచుకుంటారు ఆనంద్‌ మహీంద్రా..తాజాగా ఆయన ఒక ఫన్నీ వీడియోని పంచుకున్నారు. ఓ కోతి స్మార్ట్‌ ఆపరేట్‌ చేస్తూ… వీడియోల‌ను చూస్తున్న క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఇప్పుడ‌ది నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది. ఈ వీడియోలో ఒక కోతి చ‌క్క‌గా ముస్తాబై త‌న య‌జ‌మాని ప‌క్క‌న కూర్చుని ఫోన్‌లో వీడియోల‌ను స్క్రోల్ చేస్తుండ‌టం క‌నిపిస్తుంది.

ఇప్పుడంతా స్మార్ట్‌ ఫోన్‌ల కాలం నడుస్తుంది. ఎక్కడ చూసిన ప్రతిఒక్కరూ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోతున్నారు. అలాంటి జనాల మధ్యలో ఉంటున్న ఒక పెంపుడు కోతి కూడా స్మార్ట్‌ఫోన్‌కు అలవాటుపడింది..హాయిగా తన యజమాని పక్కనే కూర్చుని ఫోన్‌ ఆపరేట్‌ చేస్తూ తనకు నచ్చింది చూస్తుంది. ఈ ఈడియోను తొలుత క్యాన్‌వాస్ఎం సీఈఓ జ‌గ్దీష్ మిత్ర షేర్ చేశారు. ఈ అమాయ‌క ప్రాణిని ఈ హానికర అల‌వాటు నుంచి కాపాడండి అని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. జంతువులు కూడా మొబైల్ ఫోన్ల‌కు ఎలా అల‌వాటు ప‌డుతున్నాయో అని ప‌లువురు యూజ‌ర్లు రుస‌రుస‌లాడారు. కోతుల‌నూ స్మార్ట్‌ఫోన్లు నాశ‌నం చేస్తున్నాయ‌ంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..