Viral Video : కోతిపై ఎఫ్ఐఆర్ నమోదు..! మహిళా పోలీసులను వేధించిన వానరం..!! వైరలవుతున్న వీడియో

|

Jan 06, 2024 | 4:44 PM

మహిళా పోలీసులపై వేధింపుల ఆరోపణలపై కోతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా లేదా అని పోలీసులు చెప్పాలని మరొకరు వ్యాఖ్యానించారు. పోలీస్‌ వాహనంలోకి దూరిన కోతి గందరగోళం సృష్టించింది.. కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. కానీ, అదే వారిని కరిచినా లేదా గాయపరిచిన ప్రమాదమే అంటున్నారు. అదే సమయంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందంటూ

Viral Video : కోతిపై ఎఫ్ఐఆర్ నమోదు..! మహిళా పోలీసులను వేధించిన వానరం..!! వైరలవుతున్న వీడియో
Monkey And Police
Follow us on

పోలీసు వాహనంలోకి ప్రవేశించిన కోతి మహిళా కానిస్టేబుళ్లను వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం నవ్వుకుంటున్నారు. కారులో ఆయుధాలు, మహిళా పోలీసులు కూర్చుని ఉన్నారు. వీటన్నింటి మధ్య కోతి తిరుగుతూ మహిళా పోలీసులను వేధిస్తోంది. వాహనంలోకి కోతి ప్రవేశించి మహిళా కానిస్టేబుల్‌ను వేధిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అక్కడ మరో మహిళా కానిస్టేబుల్ కూడా కూర్చొని ఉండగా కోతి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతోంది. బయట నిలబడి ఉన్న ఇతర పోలీసులు నవ్వుతున్నారు. కొందరు కోతిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోతి ఎక్కువ సమయం ఒక మహిళ వద్దే ఆగి ఆమెను ఇబ్బంది పెట్టింది. కాసేపటి తర్వాత ఓ మహిళా కానిస్టేబుల్‌ కారు డోర్‌ తెరిచి బయటకు వెళ్లగా.. మందలించడంతో కోతి అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై పలువురు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

వైరల్‌ వీడియోలో పోలీస్‌ వాహనంలో ఆయుధాలు కూడా ఉన్నాయి. అలాంటి వెహికిల్‌లోకి దూరిన కోతి..అక్కడి తుపాకులు తీసుకుని పారిపోతే లేదంటే..పొరపాటున కాల్పులు జరిపితే ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో ఎవరూ ఊహించలేరంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోతిపై ఎఫ్‌ఐఆర్‌ వేయాలని, మహిళా పోలీసులను వేధిస్తుందని మరొకరు రాశారు. అతనికి కనీసం పదేళ్ల శిక్ష పడాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

మహిళా పోలీసులపై వేధింపుల ఆరోపణలపై కోతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా లేదా అని పోలీసులు చెప్పాలని మరొకరు వ్యాఖ్యానించారు. పోలీస్‌ వాహనంలోకి దూరిన కోతి గందరగోళం సృష్టించింది.. కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. కానీ, అదే వారిని కరిచినా లేదా గాయపరిచిన ప్రమాదమే అంటున్నారు. అదే సమయంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందంటూ మరికొందరు నెటిజన్లు విమర్శించారు. మొత్తానికి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..