
అడవుల్లో ఉండే కోతులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. చెట్లను నరికివేయడం, ఆహారం లభ్యం కాకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇంట్లోకి చొరబడి నానా హంగామా సృష్టిస్తున్నాయి. ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, పొలాలను నాశనం చేస్తుంటాయి. కొన్ని సార్లు అవి మనుషులపై కూడా దాడి చేస్తు్న్నాయి. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం నిత్యకృత్యంగా మారాయి. సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వీడియోలలో కొన్ని పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించినవి. అయితే కొన్ని వీడియోలు మనలను ఆశ్చర్యపరుస్తాయి. మనల్ని నవ్వించే కొన్ని వీడియోలు ఉన్నప్పటికీ, భయం కలిగించేవి కూడా ఉన్నాయి. కోతులు చాలా అల్లరి చేస్తుంటారు. వాటి వల్ల ప్రజలు కూడా చాలా భయపడుతున్నారు. ఒక వ్యక్తి కోతిని తరిమికొట్టడానికి ప్రయత్నించే సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వీడియోలో ఓ కోతి ఇంటి గోడపై కూర్చుని ఉండటాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో అక్కడికి ఓ వ్యక్తి వస్తాడు. కోతిని చూసిన అతను దానిని తరిమికొట్టేందుకు రాళ్లు అందుకుంటాడు. అంతే.. కోతికి పట్టరాని కోపం వస్తుంది. ఏ మాత్రం ఆలోచించకుండా అమాంతం అతనిపై దూకేస్తుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కింద పడిపోతాడు. ఈ వీడియో చూసేందుకు ఫన్నీగా అనిపించినా.. ఆ వ్యక్తి ప్లేస్ లో మనముంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకుంటేనే భయం వేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.