Family’s Pet: తప్పిపోయిన తాబేలు 30ఏళ్లకు ప్రత్యక్షం.. అటకమీదనే ఇంతకాలం..?

|

Jun 04, 2022 | 11:27 AM

మనం పెంచుకునే పెట్స్ మన నుంచి దూరం అయితే ఆ బాధ అంతా ఇంతా కాదు, మరీ ముఖ్యంగా అవి తప్పిపోతే అస్సలు తట్టుకోలేరు, తాజాగా ఇలాంటిదే జరిగింది.. అయితే తప్పిపోయిందనుకున్న ఆ పెట్‌..

Family’s Pet: తప్పిపోయిన తాబేలు 30ఏళ్లకు ప్రత్యక్షం.. అటకమీదనే ఇంతకాలం..?
Missing Tortoise
Follow us on

మనం పెంచుకునే పెట్స్ మన నుంచి దూరం అయితే ఆ బాధ అంతా ఇంతా కాదు, మరీ ముఖ్యంగా అవి తప్పిపోతే అస్సలు తట్టుకోలేరు, తాజాగా ఇలాంటిదే జరిగింది.. అయితే తప్పిపోయిందనుకున్న ఆ పెట్‌ తిరిగి 30ఏళ్ల తర్వాత అటకపై దొరికింది. దాంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ అక్కడ తప్పిపోయి తిరిగి దొరికింది ఏంటో తెలిస్తే..అవాక్కే!

మాన్యులా అనే తాబేలు నాథల్యే డి అల్మీడియా జాతికి చెందినది. అయితే, 1980లో అది తమ యజమాని ఇంటి నుండి తప్పిపోయింది. మూడు దశాబ్దాల తర్వాత ఆ ఇంట్లోని పాత చెక్క స్పీకర్ ఉన్న పెట్టెలో తిరిగి కనిపించింది. దాంతో ఇంట్లోని వారంతా షాక్‌ అయ్యారు. ఇన్ని సంవత్సరాల తరువాత, మాన్యులా ఇంకా బతికే ఉంది. కానీ, ఇప్పుడు ఆ తాబేలు మగది అని తేలింది. కాబట్టి దాన్ని మాన్యుయెల్ అని పిలుస్తున్నారు.

1982లో ఇంటిపై ఎలక్ట్రికల్ పని జరుగుతున్న సమయంలో మాన్యులా అదృశ్యమైందని కుటుంబీకులు చెబుతున్నారు. తాబేలును చూసిన ఆ ఇంటివారు ఆశ్చర్యపోయారు. ఆ ఇంటి ఇల్లాలు.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తిరిగి కనిపించిన తాబేలను చూసి ఒక్కసారిగా ఏడ్చేశారు. ఎందుకంటే ఆమె నమ్మలేకపోయింది. వెంటనే దొరికిన తాబేలును పశువైద్యులకు చూపించగా, ఎర్రటి పాదాల తాబేళ్లు ఆహారం లేకుండా చాలా సంవత్సరాలు జీవించగలవని స్థానిక పశువైద్యుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి