నవంబర్ 1 నుంచి మాథేరాన్‌ టాయ్‌ట్రైన్‌ సేవలు.. అన్ని విశేషాలే.. తెలిస్తే ఎంజాయ్‌ చేస్తారు..!

|

Oct 28, 2024 | 9:13 PM

నేరల్‌-మాథేరాన్‌ మధ్య నడిచే టాయ్‌‌ట్రైన్‌ మార్గం 80శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 21 కిలోమీటర్లే ఉన్నప్పటికీ రెండు గంటలపైనే సమయం పడుతుంది. కానీ, రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్ 1 నుంచి మాథేరాన్‌ టాయ్‌ట్రైన్‌ సేవలు.. అన్ని విశేషాలే.. తెలిస్తే ఎంజాయ్‌ చేస్తారు..!
Matheran Hill Station
Follow us on

మహారాష్ట్రలోని నేరల్‌-మాథేరాన్‌ మధ్య నడిచే టాయ్‌‌ట్రైన్‌ సేవలు నవంబర్‌ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం, ఈ నెల 16 నుంచి సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా ఆకస్మిక వర్షాల కారణంగా వాయిదా పడినట్టు తెలిపారు. నేరల్‌-మాథేరాన్‌ మధ్య నడిచే టాయ్‌‌ట్రైన్‌ మార్గం 80శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 21 కిలోమీటర్లే ఉన్నప్పటికీ రెండు గంటలపైనే సమయం పడుతుంది. కానీ, రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నేరల్‌-మాథేరాన్‌ మధ్య నడిచే టాయ్‌‌ట్రైన్‌ రైలు మార్గాన్ని ప్రారంభించి వందేళ్లు దాటిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటకీ ఈ మార్గం పర్యాటకులకు అత్యతం ప్రియమైనదిగా నిలుస్తోంది. రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా మాథేరాన్‌ చేరుకునే అనుభూతిని పర్యాటకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఏటా లక్షలాది పర్యాటకులు మాథేరాన్‌ను సందర్శిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ మార్గంలో వర్షాకాలంలో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. కల్వర్టులు కొట్టుకుపోతుంటాయి. పట్టాల కిందున్న మట్టి, కంకర వర్షాలు, వరదలకు తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది. ఫలితంగా అనేక చోట్ల రైలు పట్టాలు గాలిలో వేలాడుతుంటాయి. దీంతో ప్రమాదాలు జరగక ముందే ముందు జాగ్రత్త చర్యగా ఏటా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు అంటే జూన్‌ 15వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు ఈ రైలు మార్గం పూర్తిగా మూసి వేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..