కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉడిపి జిల్లాలో అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ సహా రోగి, ఇద్దరు అటెండర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కర్నాటక తీర ప్రాంత జిల్లాలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. వర్షపు నీరు, బురద కారణంగా అంబులెన్స్ అదుపుతప్పి టోల్ బూత్‌ని ఢీకొట్టినట్టుగా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్‌తో పాటు, జరిగిన ఘటనపై ఒక వైద్యుడు ట్వీట్ చేశారు.
ఉడిపి జిల్లా కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక అంబూలెన్స్ వేగంగా వస్తుంది. అక్కడ వర్షంకూడా భారీగా కురుస్తుంది. ఈ క్రమంలో.. అంబులెన్స్ సైరన్ ను విన్న సిబ్బంది.. పరిగెత్తుకుంటు బైటకు వచ్చారు. అడ్డుగా ఉన్న బారికెడ్లను తొలగిస్తున్నారు. అంతలోనే వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై బోర్లుకుంటూ.. అక్కడే ఉన్న టోల్ బూత్‌ని బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. అంబులెన్స్‌లో ఉన్న వస్తువులు అన్ని చెల్లాచెదురుగా బయట పడ్డాయి. షాకింగ్ యాక్సిడెంట్ సీన్ మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Horrific accident of Ambulance at Shirur toll plaza near #Kundapur just now @dp_satish @prakash_TNIE @Lolita_TNIE @BoskyKhanna pic.twitter.com/b9HEknGVRx
— Dr Durgaprasad Hegde (@DpHegde) July 20, 2022
ప్రమాదం జరిగిన తీరుపై CCTV ఫుటేజీలో ,.. టోల్ ఆపరేటర్లుగా కనిపించే కొందరు వ్యక్తులు అంబులెన్స్‌ను చూడగానే ఒక లేన్ నుండి మూడు ప్లాస్టిక్ బారికేడ్‌లను తొలగించడానికి పరిగెత్తడం కనిపించింది. టోల్ ప్లాజా ముందు గార్డులలో ఒకరు స్పీడ్‌గా వెళ్లి రెండు బారికేడ్లను తొలగించినట్లు ఫుటేజీలో కనిపించింది. కానీ చివరి బారికేడ్ తొలగించే లోపుగానే ప్రమాదం జరిగిపోయింది. అప్పటికి అంబులెన్స్ దాదాపు టోల్ ప్లాజాను ఢీకొట్టింది. సడెన్‌గా అంబులెన్స్, తడి రహదారిపై స్కిడ్ కావటంతో టోల్ బూత్ క్యాబిన్ వైపు దూసుకెళ్లింది. ప్రమాద ఘటన మొత్తం సీసీ టీవీ కెమెరాలో స్పష్టం కనిపించింది. ఒళ్లు గగ్గుర్పొడిచేలా కనిపించిన ఈ ఆక్సిడెంట్ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి