
ఇంటర్నెట్‌లో డైలీ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా ఫన్నీ డ్యాన్స్ వీడియోలను ప్రజలు బాగా ఇష్టపడతారు. ఇవి ప్రతిచోటా విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వ్యక్తి వివాహంలో నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యక్తి వివాహంలో బాలీవుడ్ పాటకు మహిళ మాదిరిగా వెరైటీ స్టెప్పులు వేశాడు. నెటిజన్లు అతడి డ్యాన్స్ మూవ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ముందుగా వీడియో వీక్షించండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి కోతే అప్ కోఠి పాటకు డ్యాన్స్ చేయడం మీరు చూడవచ్చు. సంజయ్ దత్, జెబా బక్తియార్ నటించిన జై విక్రాంత మూవీలోనిది ఆ పాట. ఆ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్స్, రిలేటీవ్స్ అతడ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సాంగ్ మధ్యలో మరో మిత్రుడ్ని కూడా అతడు డ్యాన్స్ చేసేందుకు పిలవడం వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటి నుంచి, నెటిజన్లు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ ఇస్తున్నారు. వీడియో చూసిన తరువాత, ఒక యూజర్ అతడి డ్యాన్స్ చాలా ఫన్నీగా ఉందని రాసుకొచ్చాడు. memes.bks అనే ఇన్‌స్టా ఖాతా మూడు రోజుల క్రితం ఈ వీడియోను షేర్ చేశారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ ఈ వీడియోను లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు.
Also Read: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్
మిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం