Mancherial: బ్యాంకుకు కన్నం వేసేందుకు వచ్చిన దొంగ.. పోతూ.. పోతూ ఏం రాశాడంటే..?

| Edited By: Ram Naramaneni

Sep 01, 2023 | 6:45 PM

మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో... గురువారం రాత్రి చోరీ యత్నం జరిగింది. కానీ ఒక్క రూపాయి‌కూడా పోలేదు. అసలు ఉంటే కదా పోవడానికి. ఈ విషయం చెప్తుంది మేం కాదు ఆ బ్యాంక్‌కు కన్నం వేసేందుకు వచ్చిన ఆ దొంగ గారు. మారుమూల మండలం కావడం.. చిన్న మొత్తాల పొదుపు మాత్రమే సాగుతుండటం.. నెల చివరాఖరి కావడంతో ఆ బ్యాంక్‌లో డబ్బులు లేవు. అయితే బ్యాంక్‌కు కన్నం వేస్తే భారీగా కాజేయచ్చు అనుకున్నాడో లేక ఇంకేం స్కెచ్ తో ఎంట్రీ ఇచ్చాడో కానీ మొత్తానికి‌ బ్యాంక్ లోకి దొంగతానానికి వెళ్లి భంగపాటుకు‌ గురయ్యాడు సదరు‌ దొంగ.

Mancherial: బ్యాంకుకు కన్నం వేసేందుకు వచ్చిన దొంగ.. పోతూ.. పోతూ ఏం రాశాడంటే..?
Bank Theft Attempt
Follow us on

దొంగలందు‌ ఈ దొంగే వేరయా అన్నట్టుగానే ప్రవర్తించాడు బ్యాంక్‌కు కన్నం వేసిన ఓ దొంగ. భారీ ఆశలతో బ్యాంక్‌లో చొరబడి.. ప్రజల కష్టార్జితాన్ని అప్పన్నంగా ఎత్తుకెళ్లిపోవాలని పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగాడు. తీరా చోరీకి వచ్చాక కానీ తెలియలేదు.. ఆ బ్యాంక్‌లో ఎత్తుకెళ్లడానికి చిల్లిగవ్వ కూడా లేదని. దీంతో చేసేదేం లేక ఏం ఎత్తుకెళ్లాలో తెలియక పోతూ పోతూ ఓ లెటర్ రాసి వెళ్లిపోయాడు. నాకు మీ బ్యాంక్‌లో ఒక్క పైసా కూడా దొరక లేదు. గుడ్ బ్యాంక్ ఇది.. నన్ను పట్టుకోవద్దు.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు. అంటూ అక్కడే ఉన్న ఓ న్యూస్ పేపర్‌పై తన చోరతత్వం ఉట్టి పడేలా నీతి వ్యాఖ్యాలు రాసి జంప్ అయ్యాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంకు చెందిన దక్కన్ గ్రామీణ బ్యాంక్ లో చోటు చేసుకుంది. దొంగలు పడ్డారని తెలియగానే లబోదిబోమన్న బ్యాంక్ ఉద్యోగులు చివరికి దొంగ తెలివి చూసి కాసేపు నవ్వుకున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో… గురువారం రాత్రి చోరీ యత్నం జరిగింది. కానీ ఒక్క రూపాయి‌కూడా పోలేదు. అసలు ఉంటే కదా పోవడానికి. ఈ విషయం చెప్తుంది మేం కాదు ఆ బ్యాంక్‌కు కన్నం వేసేందుకు వచ్చిన ఆ దొంగ గారు. మారుమూల మండలం కావడం.. చిన్న మొత్తాల పొదుపు మాత్రమే సాగుతుండటం.. నెల చివరాఖరి కావడంతో ఆ బ్యాంక్‌లో డబ్బులు లేవు. అయితే బ్యాంక్‌కు కన్నం వేస్తే భారీగా కాజేయచ్చు అనుకున్నాడో లేక ఇంకేం స్కెచ్ తో ఎంట్రీ ఇచ్చాడో కానీ మొత్తానికి‌ బ్యాంక్ లోకి దొంగతానానికి వెళ్లి భంగపాటుకు‌ గురయ్యాడు సదరు‌ దొంగ. దీంతో నిరాశతో వెనదిరిగుతూ తన గ్రహపాటును వివరిస్తూ, బ్యాంక్ పని తనానికి కితాబిస్తూ ఓ న్యూస్ పేపర్ పై ఇలా రాసి వెళ్లిపోయాడు. “నాకు ఒక్క పైసా దొరక లేదు. గుడ్ బ్యాంక్ ఇది.. నన్ను పట్టుకోవద్దు.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు..” అని రాసి మరీ జంప్ అయ్యాడు ఆ దొంగ. ఉదయం బ్యాంక్ తెరిచాక అన్ని వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో దొంగలు పడ్డారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖాకీల విచారణలో ఈ విషయం బయటపడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..