Taped Banana: వీడెవడండీ బాబూ.. ఒక్క అరటి పండును రూ.52 కోట్లకు కొని ఎలా తిన్నాడో చూడండి..

|

Dec 03, 2024 | 4:45 PM

ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్‌ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్‌ డాలర్లకు అమ్ముడోపోయి అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో

Taped Banana: వీడెవడండీ బాబూ.. ఒక్క అరటి పండును రూ.52 కోట్లకు కొని ఎలా తిన్నాడో చూడండి..
Taped Banana
Follow us on

కేవలం 5రూపాయలు విలువ చేసే అరటి పండు 52కోట్లకు అమ్ముడు పోయింది.. ఆర్ట్‌వర్క్ పేరుతో 52 కోట్లు పెట్టి సింగిల్‌ అరటి పండును కొన్నాడు ఓ వ్యాపారవేత్త..! అంతేకాదు.. అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో ఆ అరటిపండును అమాంతంగా తినేశాడు.. అయితే, బనానా టేప్‌ పేరుతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వేలంలో అరటిపండుకు నమ్మలేనంత ధర పలికింది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక అరటి పండును టేపు సాయంతో గోడకు అతికించి పెట్టారు. ఆ అరటిపండును ఓ వ్యక్తి 6.24 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 52.7 కోట్లు)కు కొనుగోలు చేశాడు. చైనాకు చెందిన పారిశ్రామికవేత్త జస్టిన్‌ సన్‌ వేలంలో ఈ అరటి పండును సొంతం చేసుకున్నాడు. ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్న ఆ ఫేమస్ అరటిపండును అందరి సమక్షంలో సెకన్ల వ్యవధిలోనే అతను దాన్ని తినేశాడు. జస్టిన్ అరటిపండు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వీడియో చూసిన ప్రజలు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇటలీ విజువల్‌ ఆర్టిస్ట్‌ మౌరిజియో కాటెలన్‌ 2019లో దీనిని సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్‌ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదని చాలా మంది వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, ఈ అరటిపండుకు కమెడియన్‌ అని పేరు పెట్టారు. కమెడియన్‌ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ను మియామి బీచ్‌ ఆర్ట్‌ బాసెల్‌లో తొలిసారి ప్రదర్శించారు. ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్‌ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్‌ డాలర్లకు అమ్ముడోపోయి అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ’52 కోట్ల అరటిపండు తింటే కడుపు నిండుతుందా’ అని కొందరు సరదాగా రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..