బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్న భారత వైమానిక దళం ( IAF ) హెలికాప్టర్‌ను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వరదలతో అతలాకుతలమైన ఔరాయ్ బ్లాక్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హెలికాప్టర్ ల్యాండింగ్ మాత్రమే అందరీ దృష్టిని ఆకర్షించలేదు. సంఘటనను డాక్యుమెంట్ తీయడానికి స్థానిక యూట్యూబర్ అక్కడికి చేరుకున్నాడు. ఆ వరదల్లో సదరు యూట్యూబర్ ఆన్-ది-స్పాట్ రిపోర్టింగ్ చేసినందుకు నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. అతడు తీసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో మునిగిపోయిన ఛాపర్ క్లియర్‌గా కనిపిస్తూ ఉంది.
వైరల్ క్లిప్‌లో, ముఖేష్ జోషి అనే యువ యూట్యూబర్ వరద నీటిలో మోకాళ్ల లోతులో నిలబడి అత్యవసర ల్యాండింగ్ గురించి అతన్ని సబ్‌స్క్రయిబర్స్‌కి వివరించాడు. అతన రిపోర్టింగ్ శైలి అందర్నీ ఆకట్టుకుంది. వీడియోలో ఇంటర్వ్యూ చేసిన స్థానిక వ్యక్తి ఒకరు ‘మన సైనికులను రక్షించడానికి తను ఎల్లప్పుడూ ప్రాణాలను పణంగా పెడతాను” అని పేర్కొన్నాడు
తొమ్మిది లక్షల వ్యూస్ సంపాదించిన ఈ వీడియో సోషల్ మీడియాలో యూట్యూబర్‌పై నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది అసలైన జర్నలిజమని, యువ రిపోర్టర్‌కు, గ్రామస్తులకు ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.