ఏం ఐడియారా బాబు.. వేడిని వెళ్లగొట్టి.. గాలిని బంధించి..! భలేగా ఎంజాయ్‌ చేస్తున్నాడు..

|

May 30, 2023 | 8:35 PM

అయితే, గాలితో నిండి కవర్‌ చూసేందుకు.. సొరంగంలా కనిపిస్తుంది. అదే గాలితో నిండిన సొరంగంలో అతడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. భిన్నమైన కామెంట్స్‌తో వీడియోని మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

ఏం ఐడియారా బాబు.. వేడిని వెళ్లగొట్టి.. గాలిని బంధించి..! భలేగా ఎంజాయ్‌ చేస్తున్నాడు..
Beat Heat
Follow us on

జుగాడ్‌ చేసే అన్ని పద్ధతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, ప్రజలేవరూ వాటిని ప్రయత్నించడానికి ఇష్టపడరు! అయితే, మీరు హీట్‌ని బీట్ చేయడానికి ‘గూగుల్’లో జుగాడ్‌ని సెర్చ్ చేస్తే, మీకు చాలా పెద్ద లిస్టే కనిపిస్తుంది. అసలే ఇది వేసవి కాలం..కాబట్టి, అందరూ చల్లగా ఇంట్లోనే ఉండాలనుకుంటారు. అయితే, ఏసీ, కూలర్ లేకుండా కూడా వాతావరణాన్ని కూల్ చేయవచ్చా? మీరు వాతావరణాన్ని చల్లబరచలేకపోవచ్చు, కానీ ఈ వైరల్ టెక్నిక్ సహాయంతో, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం మీకు ఒక టేబుల్‌ ఫ్యాన్, ప్లాస్టిక్ ఉంటే సరిపోతుంది.

ఈ జుగాడు వీడియో మే 27న ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘టెక్నికల్_పర్సనల్’ నుండి పోస్ట్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 16 వేలకు పైగా వ్యూస్‌ సాధించింది. ఈ క్లిప్‌లో ఒక వ్యక్తి మంచం మీద పడుకుని ఉండటం కనిపిస్తుంది. అయితే, ఎండవేడిలో ఫ్యాన్‌ నుంచి వచ్చే వేడి గాలి నుంచి తనను తాను రక్షించుకునేందుకు అతడు తీవ్ర పోరాటం చేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో అతడు, టేబుల్‌ ఫ్యాన్ రెక్కలకు ఒక పొడవాటి పెద్ద పాలిథిన్ కవర్‌ బిగించాడు. ఆ కవర్‌ నేరుగా తన మంచమీద వరకు పరిచాడు. ఇక అతడు అదే కవర్‌లో దూరి హాయిగా పడుకున్నాడు. కవర్‌ నిండా నిండిన గాలికి చుట్టుపక్కల గాలి తగలకపోవటంతో అది చల్లగా ఉంటుందని భావించాడు. అయితే, గాలితో నిండి కవర్‌ చూసేందుకు.. సొరంగంలా కనిపిస్తుంది. అదే గాలితో నిండిన సొరంగంలో అతడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. భిన్నమైన కామెంట్స్‌తో వీడియోని మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..