భయ్యా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.! పే..ద్ద బండరాయిని ఇంత సులువుగా కదిలించాడో చూస్తే..
తెలివి ఎప్పటికీ ఒకరి సొత్తు కాదు.. ఇది పెద్దలు చెప్పే మాట. సరిగ్గా దీనికి నిదర్శనంగా నిలిస్తూ.. ఎంతోమంది యువత తమలోని ప్రతిభను సోషల్ మీడియా వేదికగా వెలికితీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కోవకు చెందిన చాలానే వీడియోలు మనం ఇంటర్నెట్‌లో తరచూ చూస్తూనే ఉన్నాం. మరి ఈ లేటెస్ట్ వీడియోపై ఓ లుక్కేద్దాం పదండి.!
తెలివి ఎప్పటికీ ఒకరి సొత్తు కాదు.. ఇది పెద్దలు చెప్పే మాట. సరిగ్గా దీనికి నిదర్శనంగా నిలిస్తూ.. ఎంతోమంది యువత తమలోని ప్రతిభను సోషల్ మీడియా వేదికగా వెలికితీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కోవకు చెందిన చాలానే వీడియోలు మనం ఇంటర్నెట్‌లో తరచూ చూస్తూనే ఉన్నాం. సరిగ్గా అలాంటిదే ఓ వ్యక్తి తన వినూత్న ఆలోచనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. లేట్ ఎందుకు డౌట్ ఉంటే.. మీరూ వీడియో చూసేయండి.
సాధారణంగా ఓ పే…ద్ద బండరాయిని కదిలించాలంటే.. చాలా సరంజామా అవసరం. క్రేన్‌తో అతికష్టం మీద దాన్ని కదిలించవచ్చు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి కేవలం ఒక చిన్న రాయితో ఆ బండరాయిని కదిలించేశాడు. వీడియో ప్రకారం.. ఓ పెద్ద బండరాయి.. కింద ఉన్న చుట్టూ గట్టిగా మట్టి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ బండరాయిని కదిలించేందుకు.. గుళికరాళ్లు తీసుకుని.. బండరాయి చుట్టూ ఉన్న మట్టిపై కొట్టాడు.
అంతే.! ఇంకేముంది ఆ రాయి కాస్తా.. కదిలి.. కిందకు దొర్లడం ప్రారంభించింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. బండరాయి చుట్టూ ఉన్న మట్టి గట్టిగా లేకపోవడం వల్లే ఆ.. పే..ద్ద రాయి అంత ఈజీగా కదిలిందని కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
— Fck Around N Find Out (@FAFO_TV) March 19, 2024