ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. చిన్న ట్రిక్‌తో లీటర్‌కు 90కిమీ మైలేజ్.! నమ్మారో ఇక అంతే
సోషల్ మీడియాలో వాడకం పెరిగిన దగ్గర నుంచి ఎంతోమంది యువత.. ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో కొందరు తమ కష్టాన్ని నమ్ముకునే ఫేమ్ సంపాదిస్తే.. మరికొందరు లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టుగా పైపై రంగులు పూస్తూ జనాలను మోసం చేస్తున్నారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..
సోషల్ మీడియాలో వాడకం పెరిగిన దగ్గర నుంచి ఎంతోమంది యువత.. ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో కొందరు తమ కష్టాన్ని నమ్ముకునే ఫేమ్ సంపాదిస్తే.. మరికొందరు లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టుగా పైపై రంగులు పూస్తూ జనాలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బైక్ మైలేజ్‌ను పెంచేందుకు ఇలా చేయండి అంటూ చెప్పే టెక్నిక్‌కు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు అతడ్ని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
సాధారణంగా ఏ టూ-వీలర్ అయినా.. లీటర్ పెట్రోల్‌కు 45కిమీ నుంచి 60 కిమీ వరకు మ్యాగ్జిమం వెళ్తాయి. ఇక ఫోర్-వీలర్స్ విషయానికొస్తే.. లీటర్ డీజిల్‌కు 15కిమీ నుంచి 20 కిమీ నడుస్తాయి. అయితే బైక్ లీటర్‌కు 90కిమీ మైలేజ్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా.? వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ..! అవునండీ.. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేశాను అని చెబుతున్నాడు ఓ వ్యక్తి. తన బైక్ ప్లగ్, దానికి అనుసంధానమైన వైర్‌కి ఓ చిన్న పరికరాన్ని(సెమీ కండక్టర్) కనెక్ట్ చేసి.. లీటర్‌కు 25-30 కి.మీ ఇచ్చే బైక్ మైలేజ్ సగటున 90కిమీ పెంచానని చెప్పుకొచ్చాడు. ఆ పరికరం(సెమీకండక్టర్).. బైక్ మైలేజ్‌ను పెంచడమే కాకుండా.. బైక్ నుంచి తక్కువ పొగ వచ్చేలా చేస్తుందని చెప్పాడు. కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాలో ‘bapu_zamidar_short’ అనే అకౌంట్ షేర్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఈ టెక్నిక్ పూర్తిగా ఫేక్ అని..’ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇదే నిజమైతే బైక్ కంపెనీలు దీనిని ఖచ్చితంగా ప్రయత్నించేవి అని..’ మరొకరు రాసుకొచ్చారు.
View this post on Instagram