Man tries to frame innocent commuter dog: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తప్పు చేసినా.. ఒప్పు చేసినా సీసీ కెమెరా కళ్లు ఎవ్వరినీ వదిలిపెట్టవు. అలా గమనించకుండా ఓ వ్యక్తి చేసిన తప్పు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా కొందరు శాడిస్టులా బిహేవ్ చేయడం చూస్తుంటాం. వాళ్లు అలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ.. వాటిని చూస్తే చాలా జుగుప్సాకరంగా కూడా అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత చెండాలమైన పనిచేశాడో చూడండి. అది చూస్తే మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా అతన్ని తిడతారు. టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచాడు. తను అలా చేయడం ఎవరూ చూడలేదు అనుకున్నాడు. కానీ ఆ ఘటన అక్కడ సీసీఫుటేజ్‌లో రికార్డు అయింది. ఆ తర్వాత బస్సు ఎక్కిన చాలా మంది అది బోజీ పనే అనుకున్నారు. బోజీ అంటే ఇస్తాంబుల్‌లో వీధి కుక్క అని అర్థం. అయితే ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ప్రతినిధి మురత్ ఒంగున్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది.
దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తూ.. మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును చెడుగా చూపించడానికే ఇలా చేస్తున్నారంటూ అక్కడ స్థానిక మీడియా చెప్పింది. అంతేకాదు గతంలో మేయర్ పరువు తీయడానికి గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి మరీ ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ ఆ వ్యక్తి పై మండిపడుతూ ట్వీట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ జగుప్సాకరమైన వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
Wow, Turkey can still surprise me with how evil people can be!
Disgusting man tries to defame an opposition-darling dog, Boji, who famously travels on public transport, by planting dog shit on a seat.
OK, I just read that back. Turkey is surreal.pic.twitter.com/7jmisr8heO
— Can Okar (@canokar) November 20, 2021
Also Read: