ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకటి పాములుగా పరిగణించబడుతున్నప్పటికీ, సాధారణంగా అన్ని పాములు విషపూరితమైనవి. ప్రమాదకరమైనవి కావు. భూమిపై విషపూరిత పాముల సంఖ్య చాలా తక్కువ. అవును విషపూరితమైన పాముల కంటే విషం లేకుండా కూడా ప్రమాదకరమైనవిగా పరిగణించబడే కొన్ని పాములు ఉన్నాయి. ఇందులో కొండచిలువ, అనకొండ వంటి పాముల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇవి చాలా పెద్దవి. బరువైనవి. ఇవి చిన్న జంతువును, మనిషిని కూడా సులభంగా మింగగలవు లేదా వాటి ‘కండర శక్తి’తో ఎటువంటి జీవి ప్రాణాలను అయినా తీయగలవు. అయితే ఒక పెద్ద అనకొండకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
వాస్తవానికి ఒక వ్యక్తి ఎటువంటి భయం లేకుండా నీటి నుండి ఒక పెద్ద అనకొండను పట్టుకుని బయటకు తీయడం కనిపిస్తుంది. ముందుగా అనకొండ తోకను పట్టుకుని నీరు తక్కువగా ఉన్న చోటికి లాగాడు. ఆ తర్వాత పాము నోటిని ఒక్క దెబ్బతో పట్టుకున్నాడు. అప్పుడు ఆ పాము కూడా గిరగిరా తిరుగుతూ అతని చేతిని చుట్టుకుంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి తన చేతిని దాని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు.. బలమైన అనకొండ పట్టునుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే నోటిని మాత్రం వదలలేదు. చాలా కష్టంతో ఆ వ్యక్తి ఆ అనకొండను నియంత్రించగలిగాడు. తర్వాత ఆ వ్యక్తి ఆ అనకొండ నుదిటిపై ముద్దుపెట్టాడు. ఈ దృశ్యం నిజంగా రోమాలు నిక్కబొడిచేలా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి అనకొండకు అస్సలు భయపడలేదు.
భారీ అనకొండను పట్టుకున్న ఈ వ్యక్తి పేరు మైక్ హోల్స్టన్. మైక్ స్వయంగా ఈ వీడియోను తన Instagram ID therealtarzannలో షేర్ చేశాడు. ఇది ఇప్పటివరకు 7 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 2 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేశారు.
అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు వివిధ రకాల కామెంట్స్ చేశారు. ‘ఇది ప్రమాదకరమైన దృశ్యం’ అని ఒకరు, ‘అనకొండకు ఆ వ్యక్తి ఇచ్చిన ముద్దు అత్యంత షాకింగ్ సీన్’ అని ఒకరు కామెంట్ చేయగా.. పామును పట్టుకున్న వ్యక్తిని చూసి కొందరు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇది క్రూరత్వంతో కూడిన చర్య అని.. మూగ జీవిపై ఎవరూ ఇలాంటి దాడి చేయరాదని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..