జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ రోజూ నెట్టింట్లో అవుతున్నాయి. వీటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్ళు ఝల్లుమనక మానదు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక యువకుడు నీటి బయట నోరు తెరిచి విశ్రాంతి తీసుకుంటున్న మొసలి నోట్లో ఒక యువకుడు చేతి పెట్టాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రాణాలతో తానే చెలగాటం ఆడుతున్న వీడియో ఇండోనేషియాలోని పట్టాయాకి చెందినదిగా తెలుస్తోంది. ఇందులో ఓ యువకుడు మొసలితో కొన్ని విన్యాసాలు చేస్తున్నాడు
వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొసలి నీటి ఒడ్డుకు వచ్చిన విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఒక యువకుడు వేగంగా వచ్చి ఆ మొసలిని టచ్ చేసి చూశాడు. అప్పుడు ఆ మొసలి ఏ మాత్రం స్పందించలేదు. దీంతో అప్పుడు ఆ యువకుడు ఓ అడుగు ముందుకు వేసి దాని నోట్లో చెయ్యి పెట్టాడు. ఒక్కసారిగా మొసలి స్పందించి అతడిని చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువకుడు వేగంగా స్పందించి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు ఆ మొసలి నీటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ యువకుడు తన చేతికి అయిన గాయాన్ని చూసుకుంటూ నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయాడు.
మళ్ళీ అదే వీడియోలో నీటిలో ఉన్న మొసలిని బయటకు తీసుకుని రాగా ఓ పెద్ద మొసలి నోరు పెద్దగా తెరిచి పడుకొని ఉంది. అప్పుడు ఆ యువకుడు మొసలి నోట్లో తల పెట్టుకుని పడుకున్నాడు. చేయి ఊపుతూ ఏదో చెబుతున్న యువకుడి వీడియో వైరల్ అవుతోంది. యితే ఎక్కడా మొసలిని టచ్ చేయలేదు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ది మిలియన్ ఇయర్స్ స్టోన్ పార్క్ అండ్ పట్టాయా క్రోకోడైల్ ఫామ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది చూశారు, వేలాది మంది లైక్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో రకరాకాల కామెంట్స్ చేశారు. ఇవన్నీ నీకు అవసరమా సామీ.. మొసలికి తిక్కరేగితే ప్రాణాలు తీసేస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..