ఆమ్లెట్..దాదాపు భోజనప్రియులందరికీ ఇష్టమైనదే. దీనిని చాలా మంది చాలా రకాలుగా తయారు చేస్తుంటారు. కొందరు ఆమ్లెట్‌కు వెన్న యాడ్ చేస్తారు. మరి కొందరు నెయ్యి, ఇతర కూరగాయలు వేసి తయారు చేస్తుంటారు. ఇకపోతే, మార్కెట్లో ఎన్నో రకాల ఆమ్లెట్ లభిస్తుంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తయారు చేసిన ఆమ్లెట్ చూసిన గుడ్డు ప్రియులు గుర్రుమంటున్నారు. ఇదేం ఆమ్లెట్‌రా బాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతడు కోక్ కూల్‌డ్రింక్‌తో ఆమ్లెట్ తయారు చేశాడు.
వైరల్ వీడియోలో ఆ వ్యక్తి ముందుగా పాన్‌ని వేడి చేయడం, ఆ తర్వాత అందులో ఒక డబ్బా నుండి కోక్ పోశాడు. అందులోనే రెండు గుడ్లు కొట్టిపోశాడు. ఆ తర్వాత పాన్‌లో మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుతున్నాడు. ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను కూడా వేశాడు. కాసేపు వేయించిన తర్వాత, అతను గుడ్డు బుర్జిలా తయారు చేశాడు. అందులో ఉప్పు, ఇతర మసాలాలు కూడా కలుపుతాడు. డిష్ రెడీ అయిన తరువాత.. వడ్డించే ముందు, దానిపై నుండి టమాటా సాస్ కూడా యాడ్ చేశాడు.
వీడియో ఇక్కడ చూడండి..
❌ Fast Food
✅ Last Food pic.twitter.com/aXqlNtykX2— NO CONTEXT HUMANS (@HumansNoContext) January 8, 2025
ఈ వీడియో @HumansNoContext అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. కాగా, ఈ వీడియోని ఇప్పటికే వేలాది మంది చూసారు. అంతే కాకుండా చాలా మంది ఇదేం తిండిరా బాబోయ్ అంటూ స్పందించారు. కొందరు మాత్రం వీడియో చూసి అతనికి పిచ్చెక్కిందని అంటున్నారు. ఈ ఆమ్లెట్ ఎవరు తింటారని అడిగితే.. మరొకరు ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, అది తిన్నవాళ్లకు అదే లాస్ట్ ఫుడ్ అంటూ రాశారు. ఈ వీడియోను చూసిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి