Viral: టాయిలెట్‌లో కూర్చుని వీడియో గేమ్.. అదే సమయంలో వింత శబ్దాలతో షాకింగ్ సీన్.. చివరకు..

కొంతమందికి టాయిలెట్‌లో కూర్చుని పేపర్ రీడింగ్, స్మోకింగ్ చేయడం అలవాటుగా మారింది. అదే సమయంలో ఇంకొందరు టాయిలెట్‌లో కూర్చుని మొబైల్‌ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. .

Viral: టాయిలెట్‌లో కూర్చుని వీడియో గేమ్.. అదే సమయంలో వింత శబ్దాలతో షాకింగ్ సీన్.. చివరకు..
Snake Bite

Updated on: May 26, 2022 | 12:50 PM

ఈ మధ్యకాలంలో కొంతమందికి టాయిలెట్‌లో కూర్చుని పేపర్ రీడింగ్, స్మోకింగ్ చేయడం అలవాటుగా మారింది. అదే సమయంలో ఇంకొందరు టాయిలెట్‌లో కూర్చుని మొబైల్‌ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. ఆ కోవలోనే ఇక్కడొక వ్యక్తి.. టాయిలెట్‌లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతుండగా.. అతడికి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. మొదటిగా వింత శబ్దాలు వినిపించగా.. ఆ తర్వాత ఎదురైన షాకింగ్ సీన్‌తో అతడు యముడికి షాక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి రావల్సి వచ్చింది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి..

వివరాల్లోకి వెళ్తే.. మలేషియాలోని సెలయంట్‌కు చెందిన 28 ఏళ్ల సబ్రి తజలికి టాయిలెట్‌లో వీడియో గేమ్స్ ఆడటం అలవాటు. ఆ క్రమంలోనే ఒక రోజు టాయిలెట్ సీట్‌పై కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. ఈలోపు అతడికి వింత శబ్దాలు వినిపించగా.. అవి కూడా పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడటంలోనే నిమగ్నమైపోయాడు. అయితే ఈలోపు జరగాల్సింది జరిగిపోయింది. టాయిలెట్ బేసిన్‌లో ఉన్న పాము.. అతడి ప్రైవేటు పార్ట్‌ను కరిచి పట్టుకుంది. ఠక్కున అప్రమత్తమైన మనోడు దాన్ని పట్టుకుని లాగి పడేశాడు.. హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశాడు. డాక్టర్లు పరిశీలించి.. అది విషపూరితమైన పాము కాదని.. ఖంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. డాక్టర్లు యాంటీ టెటాసస్ ఇంజెక్షన్ ఇచ్చి అతడికి చికిత్స అందించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. స్నేక్ క్యాచర్స్ సమాచారం అందుకుని సబ్రి ఇంటికి చేరుకున్నారు. అతడి ఇంటి బాత్‌రూమ్‌లో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకుని బంధించారు. కాగా, సబ్రి ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకుని.. ఫోటోలను షేర్ చేశాడు.