Viral Video: కింగ్ కోబ్రా మూడ్‌ బాగున్నట్లుంది సామీ.. లేకపోతే కథ వేరేలా ఉండేది.. వైరలవుతోన్న వీడియో

King Cobra: పాము పేరు వినగానే చాలా మంది భయపడిపోతుంటారు. పొరపాటున ఎప్పుడైనా అది తారసపడితే అంతే సంగతులు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమవుతారు. అయితే ప్రస్తుతం కొంతమంది విష సర్పాలతో సరదాగా ఆటలాడుకుంటున్నారు.

Viral Video: కింగ్ కోబ్రా మూడ్‌ బాగున్నట్లుంది సామీ.. లేకపోతే కథ వేరేలా ఉండేది.. వైరలవుతోన్న వీడియో
King Cobra

Updated on: Sep 13, 2022 | 5:24 PM

King Cobra: పాము పేరు వినగానే చాలా మంది భయపడిపోతుంటారు. పొరపాటున ఎప్పుడైనా అది తారసపడితే అంతే సంగతులు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమవుతారు. అయితే ప్రస్తుతం కొంతమంది విష సర్పాలతో సరదాగా ఆటలాడుకుంటున్నారు. పెంపుడు జంతువుల వలే వాటిని కూడా లాలిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా తెగ వైరలవుతున్నాయి. అలాంటి వీడియో మరొకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక యువకుడు ప్రమాదకరమైన నాగుపాముతో ఆటలాడుతున్నాడు. అతని నుంచి పాము దూరంగా పోతున్నా వదిలిపెట్టడు. చేతులతో పట్టుకుని ఆటలాడుతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో నాగుపాము ఒకటి. ఇది కాటేస్తే మనుషులు ప్రాణాలతో బయటపడడం అంత సులభమేమీ కాదు. అందుకే సాధ్యమైనంతవరకు నాగుపాములకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ వీడియోలో యువకుడు మాత్రం నాగుపామును ఓ పెంపుడు జంతువులా భావించాడు.

world_of_snakes_ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ ద్వారా ఈ వీడియో షేర్‌ చేయగా, క్షణాల్లో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘ ఈ అబ్బాయికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి’, ‘ఆ పాముకు కోరలు పీకేసి ట్రైనింగ్‌ ఇచ్చి ఉంటారేమో’, పాము మంచి మూడ్‌లో ఉంది కాబట్టి బతికి పోయాడు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..