Viral News: వీడు దేవుడ్రా బాబు.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు..

|

Dec 21, 2022 | 6:07 PM

చలికాలంలో ఉదయం ఏడు గంటలకంటే ముందు, రాత్రి 8 గంటల తర్వాత.. రోడ్డుపై వెళ్తేనే అమ్మో చలి అంటుంటాం.. అదే శీతాకాలంలో ఏసీ వేసినా, ఫ్యాన్‌ స్పీడ్‌గా పెట్టినా.. చలికి తట్టుకోలేరు. మరి శీతాకాలంలో మైనస్‌ డిగ్రీల్లో డ్యాన్స్ చేయడం అంటే మాటాలా.. అది కూడా భాంగ్రా నృత్యం..

Viral News: వీడు దేవుడ్రా బాబు.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు..
Man Performs Bhangra Dance
Follow us on

చలికాలంలో ఉదయం ఏడు గంటలకంటే ముందు, రాత్రి 8 గంటల తర్వాత.. రోడ్డుపై వెళ్తేనే అమ్మో చలి అంటుంటాం.. అదే శీతాకాలంలో ఏసీ వేసినా, ఫ్యాన్‌ స్పీడ్‌గా పెట్టినా.. చలికి తట్టుకోలేరు. మరి శీతాకాలంలో మైనస్‌ డిగ్రీల్లో డ్యాన్స్ చేయడం అంటే మాటాలా.. అది కూడా భాంగ్రా నృత్యం చేశాడు ఓ వ్యక్తి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కెనడాకు చెందిన డ్యాన్సర్ గుర్దీప్ పంధేర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కెనడా అరణ్యంలో అత్యంత చలిగా ఉండే ప్రాంతంలో ఆ డ్యాన్సర్‌ భాంగ్రా నృత్యం చేశాడు. యుకాన్ అరణ్యంలో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లో, ప్రకృతి ఎంతో ప్రశాంతంగా, వాతావరణం చల్లగా, అద్భుతంగా ఉందని, గాలి సైతం గడ్డకట్టుకుపోతున్నప్పటికీ ఊపిరితిత్తులకు చాలా రిఫ్రెష్‌గా ఉన్నాయంటూ. ఈ సహజ వాతావరణంలో తాను వెచ్చదనం కోసం నృత్యం చేసినట్లు తెలిపాడు. తాను ప్రపంచానికి మంచి వైబ్‌ని పంపుతున్నానంటూ వీడియోతో పాటు ట్వీట్ చేశాడు గుర్దీప్‌ పంథేర్. మంచుతో నిండి ఉన్న నేలపై నిలబడి శీతాకాలపు దుస్తులు ధరించి ఉన్న ఈ డ్యాన్సర్ నృత్యం చేశాడు. ఒకరోజు క్రితం పోస్టు చేయబడిన ఈ వీడియో ఇప్పటివరకు లక్షల మంది వీక్షించగా, పది వేల లైక్‌లు వచ్చాయి.

ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. డౌన్ హోమ్ ఫిడిల్ సంగీతానికి నృత్యం చేయడం తాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, ఈ డ్యాన్స్‌ దానిని గుర్తుకు తెస్తోందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. మీ డ్యాన్స్ ప్రపంచానికి వెచ్చదనాన్ని తీసుకొస్తుందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లో డ్యాన్స్ చేయడం వెనుక ఏదో ప్రత్యేకత ఉందని మరో నెటిజన్ కామెంట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..