Viral Video: మంటపుట్టిస్తున్న ఎండలు.. స్టౌ లేకుండా ఎండలో ఆమ్లెట్ వేసుకుంటున్న యువకుడు.. వీడియో వైరల్

Viral Video: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు(Summer Heat) నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి, వేసవి తాపానికి(Heat Waves) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో..

Viral Video: మంటపుట్టిస్తున్న ఎండలు.. స్టౌ లేకుండా ఎండలో ఆమ్లెట్ వేసుకుంటున్న యువకుడు.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2022 | 9:34 AM

Viral Video: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు(Summer Heat) నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి, వేసవి తాపానికి(Heat Waves) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉంది.  మరి ఈ ఎండ వేడికి మనిషి మాత్రమేనా, గుడ్డు కూడా ఎలా ఉంటాయో తెలుసా అంటూ ఓ వ్యక్తి ప్రయోగం చేశాడు. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి ఢిల్లీలోని మండే వేడిలో టెర్రస్ మీద ఆమ్లెట్ తయారు చేస్తున్నట్లు కనిపిస్తాడు.

ఎవరైనా ఆమ్లెట్‌ను స్టౌ మీద తయారు చేయడం సర్వసాధారణం చూసే విషయమే.  అయితే ఆమ్లెట్ గ్యాస్‌తో కాకుండా సూర్యకాంతితో తయారు చేస్తున్నారు. సూర్యుడు భగభగమంటున్నడు. ఆ వ్యక్తి టెర్రస్‌పై పాన్‌తో నిల్చున్నట్లు ఆ వీడియోలో చూడవచ్చు. బాణలిలో కొంచెం నూనె పోసి అందులో గుడ్డు పగలగొట్టి వేశాడు. వాస్తవానికి  వేడి కారణంగా..  పాన్ చాలా వేడిగా మారింది. అనంతరం పాన్ పై వేసిన గుడ్డు ఆమ్లెట్ వేగడం ప్రారంమైంది. ఇలా ఆమ్లెట్‌ని ఎవరూ తయారు చేయాలనుకోరు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో cadel_tales అనే IDలో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 10.8 మిలియన్లు అంటే 1 కోటి 8 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అనేకాదు 5 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను కూడా ఇష్టపడ్డారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేశారు.  ఒకరు సరదాగా ‘ఈ పాన్ గత వేసవిలో దుబాయ్‌లో ఉంది’ అని కామెంట్ చేయగా మరొకరు ‘సోదరా, రాజస్థాన్‌కు ఎప్పుడైనా రండి, వేసవి అంటే ఏమిటో తెలుస్తుంది’ అని రాశారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: 

Lunar Eclipse 2022: ఈ నెల 16న ఈ ఏడాదిలో ఫస్ట్ చంద్రగ్రహణం.. దీని ప్రభావం ఏఏ దేశాలపై ఉండనున్నదంటే

Bay Leaves Benefits: బిర్యానీ ఆకు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..