Viral Video: కళాకారులంతా మన దగ్గరే ఉన్నారనుకుంట.. ఈ వింత బైక్‌ని చూశారా..?

చాలామందికి కొత్త కొత్త బైకులు నడపడం అంటే ఇష్టపడతారు. మార్కెట్‌లో వచ్చే ఏ మోడల్‌ బైక్‌ అయినా నడిపి తీరాల్సిందే. కొందరికి ఇలాంటి ఆసక్తి ఉన్నా వాటిని కొనుగోలు చేయలేక వారే రకరకాల వింత వాహనాలను తయారు చేసుకొని నడుపుతుంటారు. అలాంటి జుగాడ్‌లు మనం నెట్టింట చాలానే చూశాం. భారతదేశంలో ఇలాంటి జుగాడ్‌లు తయారుచేసేవారు చాలామందే ఉంటారు. అయితే వీళ్ల ఐడియాలు మాత్రం నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పొచ్చు.

Viral Video: కళాకారులంతా మన దగ్గరే ఉన్నారనుకుంట.. ఈ వింత బైక్‌ని చూశారా..?
Innovative Bike

Updated on: Apr 17, 2025 | 1:39 PM

ఓ యువకుడు తయారుచేసిన ఈ బైక్‌ చూస్తే నెక్ట్స్‌ లెవల్‌ అని మీరే అంటారు. ప్రస్తుతం ఓ వినూత్న బైక్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతని ఐడియాకి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎలా వస్తాయ్‌ బాస్‌..ఇలాంటి ఐడియాలు అంటున్నారు.

పూర్వం కరెంట్‌ పోగానే జనరేటర్‌ ఆన్‌ చేసేవాళ్లు గుర్తుందా.. సినిమా హాల్లో సినిమా మధ్యలో కరెంట్‌ పోతే థియేటర్‌ వాళ్లు జనరేటర్‌ ఆన్‌చేసేవరకూ గోలగోల చేసేవాళ్లు ప్రేక్షకులు. గుర్తొచ్చిందా.. మనోడి మెయిన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ అదే. ఈ పాత జనరేటర్‌ని ఉపయోగించి అద్భుతమైన బైక్‌ తయారు చేశాడు. ఇందుకోసం ట్రాక్టర్‌ ముందు భాగంలో ఉండే రెండు టైర్లను తీసుకున్నాడు. అలాగే బైక్‌కు వావలసిన హ్యాండిల్, లైట్లు, సీటు సహా మిగతా విడి భాగాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. అన్నిటినీ చక్కగా ఫిట్‌ చేశాడు. బైకు చక్రాల స్థానంలో ట్రాక్టర్‌ టైర్లను అమర్చి మధ్యలో జనరేటర్‌ ఫిట్‌ చేశాడు. అలా ఓ సూపర్‌ బైక్‌ను తయారు చేశాడు. తన ప్రయోగాన్ని చెక్‌ చేద్దామని ట్రయల్‌ రన్‌కి సిద్ధమయ్యాడు. జనరేటర్‌ను ఇనుప హ్యాండిల్ సాయంతో గిరగిరా తిప్పి స్టార్ట్ చేశాడు. బైక్‌ స్టార్టయింది.. ఇంకేముంది.. తన కొత్త బైక్‌తో రోడ్డుపై రయ్యిన దూసుకెళ్లాడు. అయితే ఈ వింతబైక్‌ చేసే విచిత్ర శబ్ధాలకు రోడ్డుపైన వెళ్లేవాళ్లు ఓర్నాయనో ఇదేం బైకురా సామీ అంటూ చెవులు మూసుకుని చూస్తుండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వేలాదిమంది వీక్షించారు.. వందల్లో లైక్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..