
అడవి జంతువులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దూరం నుంచి చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపించే ఏనుగులు మనుషులకు చాలా పనుల్లో సాయం చేస్తుంటాయి. అదే ఏనుగుకు కోపం వచ్చినప్పుడు చూడాలి.. గజరాజు ఘీంకారం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. అందుకు సంబంధించిన ఘటనలు అనేకం వార్తల్లో చూస్తూనే ఉంటాం.. గజరాజుకు కోపం వచ్చిందంటే ఆ ప్రాంతమంతా బీభత్సం సృష్టిస్తుంది. చిర్రెత్తుకొచ్చిన ఏనుగుకు చిన్న పెద్ద తేడా లేదు.. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో నేల కూల్చేస్తాయి. భారీ ఇళ్లను కూడా క్షణాల్లో ధ్వంసం చేసేస్తాయి. అయితే, ఓ ఏనుగు దాడి నుంచి ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి అనుభవం ఎదురైందో చూపించే వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
ఏనుగును దగ్గర నుంచి చూసేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఈ షాకింగ్ కర్ణాటకలోని మైసూరు రోడ్డుపై జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా వారికి ఏనుగు కనిపించింది. దీంతో కారు దిగి దానిని దగ్గరి నుంచి చూసే సాహసం చేశారు. అంతే, ఇంకేముంది.. ఆ ఏనుగు వారిని ఓ ఆట ఆడేసుకుంది.. ఉన్నట్టుండి ఆ ఏనుగు వారిని వెంబడించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులంఘించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఒకతను పరిగెత్తలేక కింద పడిపోయాడు. అయితే దేవుడి దయతో ఏనుగు అతడికి పట్టించుకోకుండా వెనుదిరగడంతో బతికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..