వీడు మనిషా.? రాక్షసుడా.? కుక్కను కొనేందుకు డబ్బు ఇవ్వలేదని కన్నతల్లినే..! ఏం చేశాడో తెలిస్తే

తీవ్రంగా గాయపడిన అతడి తల్లి, భార్యను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వృద్ధురాలైన తల్లి మరణించింది. అతడి భార్యకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రదీప్‌పై కేసు నమోదు చేశాడు. పరారీలో ఉన్న ప్రదీప్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

వీడు మనిషా.? రాక్షసుడా.? కుక్కను కొనేందుకు డబ్బు ఇవ్వలేదని కన్నతల్లినే..! ఏం చేశాడో తెలిస్తే
Crime

Updated on: Apr 18, 2025 | 8:48 PM

రెండు వందల రూపాయలు అడిగితే ఇవ్వనందుకు ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కుక్కపిల్లను కొనేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో అతడు కన్న తల్లిని కడతేర్చాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రదీప్ దేవాంగన్ అనే వ్యక్తి రూ.200 ఇవ్వలేదనే కోపంతో తన వృద్ధ తల్లిపై దాడికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అని చూడకుండా దారుణంగా కొట్టి చంపాడు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు..ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల ప్రదీప్ దేవాంగన్ పెంపుడు కుక్కను కొనాలని అనుకున్నాడు. అతడు రూ.800కి కుక్కపిల్ల కొనాలని అనుకున్నాడు. కానీ అతని వద్ద రూ.200 తక్కువగా ఉండటంతో తన తల్లిని అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు.

ప్రదీప్‌కు డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో అతడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న సుత్తితో తల్లిపై దాడి చేశాడు. ఆమె తలపై బలంగా కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య రామేశ్వరిని కూడా సుత్తితో కొట్టాడు. కాగా, నానమ్మ, అమ్మను కొడుతున్న తండ్రి ప్రదీప్‌ను అడ్డుకునేందుకు వారి 15 ఏళ్ల కొడుకు ప్రయత్నించాడు. కానీ, ఆపలేకపోయాడు.. భయంతో బయటకు పరుగులు తీసి ఇరుగు పొరుగువారి సహాయం కోరాడు.

విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు రావడంతో ప్రదీప్‌ పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడి తల్లి, భార్యను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వృద్ధురాలైన తల్లి మరణించింది. అతడి భార్యకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రదీప్‌పై కేసు నమోదు చేశాడు. పరారీలో ఉన్న ప్రదీప్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..