వయసుతో పనిలేదు కొందరి బుద్ధి అల్పబుద్ధి.. పెద్దవారు తమ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమకంటే చిన్నవారికి మంచి చెడులను చెబుతూ మార్గ నిర్దేశాన్ని చేయాలి. అయితే కోపం వస్తే తమ వయసుని చేస్తున్న పనిలో ఉచితానుచితాలు మరచి ప్రవర్తిస్తారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా వైరల్ అవుతున్న వీడియో. ఓ వృద్ధుడుకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఒక వృద్ధుడు చేసిన పని చూపరులకు ఆగ్రహాన్ని కలిపిస్తుంది. ఎంతగా ఆగ్రహం కనబరుస్తున్నారంటే.. ఆ వృద్ధుడు వీల్‌చైర్‌లో కూర్చుని ఉన్నాడు. అయినప్పటికీ వృద్ధుడి పట్ల సానుభూతిని చూపించడం లేదు. సరికదా అసలు ఇతను మనిషేనా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన ఒక షాప్ కు జారవేసి 30 అడుగుల ఎత్తు ఉన్న నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద ఓ వ్యక్తి నిల్చుకుని పని చేస్తున్నట్లు ఉన్నాడు. అయితే అక్కడకికి వీల్ చైర్ లో వచ్చిన ఓ వృద్ధుడు నిచ్చెన లాగి కింద పడేశాడు. దీంతో నిచ్చెన మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రోడ్డుమీద పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడడంతో వ్యక్తికీ బాగా దెబ్బలు తగిలాయి. లేవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ వ్యక్తికి ఆసరా ఇచ్చి లేపారు.
వీడియోలో వృద్ధుడు వీల్‌చైర్ గబగబా వచ్చి అక్కడ ఉన్న నిచ్చెనను బలంగా కదిలించడం ప్రారంభిస్తాడు. మొదట్లో ఏం చేస్తున్నాడో అర్థం కాకా తికమకగా చూస్తూ ఉంటె.. సడెన్ గా పై నుంచి కిందపడిన వ్యక్తిని చూసిన తర్వాత అసలు విషయం అర్థమయింది. నిజానికి ఆ వ్యక్తి ఒక పెయింటర్, నిచ్చెన సహాయంతో పైకి ఎక్కి గోడపై పెయింటింగ్ చేస్తున్నాడు.. వృద్ధుడు కోపంతో చేసిన పనికి అందరు షాక్ తిన్నారు.
Man in wheelchair shakes painter’s ladder because it is ‘blocking the pavement’ causing him to fall 30ft to the ground 😳
— Crazy Clips (@crazyclipsonly) July 29, 2023
ఈ ఆశ్చర్యకరమైన వీడియో @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 37 సెకన్ల ఈ వీడియోను 1.4 కోట్ల సార్లు వీక్షించగా, 62 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో వీడియోను చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది హత్యాయత్నం’ అని కొందరంటే, ‘వీల్‌చైర్‌పై కూర్చున్న వ్యక్తిపై విచారణ జరిపించాలి.. జైలులో పెట్టాలని మరికొందరు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..