
నేరాలు చేయడానికో, దొంగతనాలు చేయడానికో కొంతమంది తమ వేషాలు మారుస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మహిళల బాత్‌రూమ్‌లోకి వెళ్లేందుకు బుర్ఖా ధరించాడు. ఈ వింత ఘటన కరీంనగర్ నగర శివార్లలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. ఓ పురుషుడు ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాను ధరించి ఆ మెడికల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అతని వెంట ఓ మహిళ కూడా వెళ్లింది.
అయితే ఆ మహిళ స్కార్ఫ్ కట్టుకొని ఉంది. వీరిద్దరి తీరు చూసి అనుమానం వచ్చిన మెడికల్ కాలేజ్ సిబ్బంది వీరిని ఆపి తనిఖీ చేశారు. బుర్ఖా తీసి చూడగా వాళ్లు షాక్ అయ్యారు. ఎందుకంటే అతనో పురుషుడు, అలాగే ఓ మహిళ స్కార్ఫ్ ధరించి అతనితో పాటు ఉంది. వీళ్లిద్దరూ ఇలా ముఖాలు కనబడకుండా బాత్‌రూమ్‌లోకి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.
వీళ్లు దొంగతనానికి వచ్చారా? లేదా ఏదైనా అసాంఘీక కార్యక్రమంలో లేడీస్ బాత్‌రూమ్‌లోకి దూరారా? అనేది తెలియాల్సి ఉంది. ఇలా బుర్ఖా ధరించి మహిళల బాత్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని, అలాగే అతనితో పాటు ఉన్న మహిళను మెడికల్ కాలేజీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఇక పోలీసులు వారి స్టైల్‌లో విచారిస్తే తప్ప వాళ్లిద్దరూ లేడీస్ బాత్‌రూమ్‌లోకి ఎందుకు వెళ్లారనేది తేలుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి