Viral Post: రూ.1.3 కోట్లతో ఆరు నెలల ఉద్యోగ ఆఫర్‌..! కానీ, ట్విస్ట్‌ ఏంటంటే..

ఒక రెడ్డిట్ యూజర్ అంటార్కిటికాలో భారీ జీతంతో (₹1.3 కోట్లు, వసతి, ఆహారంతో సహా) ఆరు నెలల పర్యావరణ పరిశోధన ఉద్యోగం పొందాడు. కానీ, అది తన మూడేళ్ల సంబంధం, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నాడు. కెరీర్, ప్రేమ మధ్య సందిగ్ధంలో ఉన్న అతను రెడ్డిట్‌లో ప్రజల సలహా కోరాడు. చాలా మంది ఆర్థిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించారు.

Viral Post: రూ.1.3 కోట్లతో ఆరు నెలల ఉద్యోగ ఆఫర్‌..! కానీ, ట్విస్ట్‌ ఏంటంటే..
Antarctica Job

Updated on: Dec 14, 2025 | 3:09 PM

చదువు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందాలని కోరుకుంటారు. కానీ అది వారి డిగ్రీ, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో భారీ జీతం ప్యాకేజీ పొందిన తర్వాత కూడా ఉద్యోగులు నిరాశలోనే ఉంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జీతం పని స్వభావం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇందులో కొన్ని అసౌకర్యమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆఫీసు పనులు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డిట్‌లో వైరల్ అయిన పోస్ట్ ప్రజలను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ పోస్ట్‌లో ఒక వ్యక్తికి రూ.1.3 కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. ఇందులో అతనికి ఉచిత వసతి, ఆహారం లభిస్తుంది. కానీ, సదరు వ్యక్తి ఆ ఉద్యోగం చేయాలా వద్దా అనే దానిపై ప్రజల సలహా కోరుతున్నాడు.

ఆ ఉద్యోగం ఏమిటి..? ఎక్కడ దొరికింది? :

ఒక రెడ్డిట్ యూజర్ ఈ ఉద్యోగంలో చేరాలా వద్దా తెలియక ఇబ్బంది పడుతున్నాడు. 29 ఏళ్ల వ్యక్తి పర్యావరణ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం కోసం అతన్ని మంచు ఖండంలోని మెక్‌ముర్డో స్టేషన్‌లో నియమించాల్సి వస్తుంది. అతనికి భారీ జీతం లభిస్తుంది. కానీ, ఇక్కడే అతను సందిగ్ధంలో పడ్డాడు. ఈ ఉద్యోగం తన మూడేళ్ల సంబంధం, వ్యక్తిగత జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని అతను వాపోతున్నాడు.. ఎందుకంటే.. తాను పర్యావరణ పరిశోధన రంగంలో పనిచేస్తున్నానని, తన కంపెనీ తనకు అంటార్కిటికాలోని మెక్‌ముర్డో స్టేషన్‌లో ఆరు నెలల పరిశోధన నిమిత్తం కేటాయించింది.. ఇందుకుగానూ తనకు భారీ జీతం ఆఫర్ చేశారు. ఫ్రీ ఫుడ్, విమాన సౌకర్యం, మొబైల్ డేటాతో సహా ఆరు నెలలకు 13 మిలియన్ రూపాయలను అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజలు ఇచ్చిన సలహా ఏమిటి :

అయితే, ఇప్పుడు తన సమస్యల్లా తన స్నేహితురాలు.. ఈ ఉద్యోగం కారణంగా ఆమె అసంతృప్తిగా ఉందని చెప్పాడు. తన స్నేహితురాలు తనకు మద్దతుగా నిలుస్తుందని, కానీ, ఆమె ఆరు నెలలు దూరంగా ఉండటం పట్ల సంతోషంగా లేదని చెప్పాడు. గత మూడేళ్లుగా తన స్నేహితురాలితో కలిసి జీవిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు సడెన్ గా తనను వదిలి వెళ్లాలంటే కష్టంగా ఉందని బాధపడుతున్నాడు. అయినా  ఆమె తనను అర్థం చేసుకుంటుందని అంటున్నాడు. ప్రస్తుతం తన నికర ఆస్తుల విలువ 16.2 మిలియన్ రూపాయలు అని అతను వివరించాడు. అతను ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే, అది రెట్టింపు అవుతుంది. కానీ, అది అతనికి చాలా కష్టం అని కూడా అతను చెప్పాడు. ఇప్పుడు, ఈ సందిగ్ధతపై ప్రజలు అతనికి ఏం సలహా ఇస్తున్నారో తెలుసుకుందాం.

Posts from the fire
community on Reddit

రెడ్డిట్‌లో ఈ పోస్ట్‌కు 7,000 కంటే ఎక్కువ అప్‌వోట్లు, వేల కామెంట్లు వచ్చాయి. చాలా మంది ప్రజలు అతనిని ఉద్యోగ ఆఫర్‌ను అంగీకరించమని కోరారు. అయితే, కొందరు అంటార్కిటికాలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తి చూపారు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు..తనకు ఇలాంటి ఆఫర్ వస్తే.. వదిలి వెళ్ళేవాడిని కాదు అన్నాడు. మరొకరు స్పందిస్తూ..మొదట్లో అక్కడ బాగుంటుంది, ఆపై మీరు విసుగు చెందడం మొదలవుతుందని చెప్పారు. కానీ, ఇది మంచి అనుభవం అవుతుందని చెప్పారు. చాలా మంది ఈ అవకాశం మంచిదని, దానిని మిస్ చేయకూడదని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..