పాత ఇంటి గోడలో బయటపడ్డ వందేళ్లనాటి బీర్‌ బాటిల్‌.. దానిపై అతి ముఖ్యమైన మెసేజ్‌..! ఏంటంటే..

|

Oct 24, 2023 | 11:25 AM

ఇంటి గోడల మధ్య ఉన్న చిన్న రంధ్రంలో ఒక్క బీరు సీసాను భద్రంగా దాచి ఉంచారు. ఆ ఇంటి మరమ్మతులు జరుపుతుండగా.. గోడలోంచి బీరుతో నిండి ఉన్న ఆ సీసా దొరికింది. ఈ బీర్ బాటిల్‌పై సూక్ష్మంగా రాసిన సందేశం కూడా కనిపించింది. పురాతన బీర్‌ బాటిల్‌ మెసేజ్‌పై చాలా మంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. దానిపై రాసిన మెసేజ్‌ ఆధారంగా..

పాత ఇంటి గోడలో బయటపడ్డ వందేళ్లనాటి బీర్‌ బాటిల్‌.. దానిపై అతి ముఖ్యమైన మెసేజ్‌..! ఏంటంటే..
Beer Bottle
Follow us on

ఏదైనా నిధి రహస్యాలు, గూఢాచారి సందేశలను అతి భద్రంగా దాచిపెడుతుంటారు. అలాంటి మెసేజ్‌లను బాటిల్‌లో భద్రపరచడం, వాటిని సంవత్సరాల తరబడి దాచి ఉంచడం గురించి గతంలో అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో అలాంటి సంఘటనలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఈసారి కూడా అలాంటిదే మరో బాటిల్‌ మెసేజ్‌ వెలుగులోకి వచ్చింది. ఒక పాత ఇంటిలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా గోడ వెనుక దాచిన బీర్ బాటిల్ ఒకటి బయటపడింది. ఇది 1955లో తయారైన బీర్. అంతేకాదు ఈ బీరుపై ఓ సందేశం రాసి ఉంది. ఇప్పుడు ఈ మెసేజ్ రివీల్ అయింది.

ఇంటి గోడల మధ్య ఉన్న చిన్న రంధ్రంలో ఒక్క బీరు సీసాను భద్రంగా దాచి ఉంచారు. ఆ ఇంటి మరమ్మతులు జరుపుతుండగా.. గోడలోంచి బీరుతో నిండి ఉన్న ఆ సీసా దొరికింది. ఈ బీర్ బాటిల్‌పై సూక్ష్మంగా రాసిన సందేశం కూడా కనిపించింది. దానిపై రాసిన మెసేజ్‌ ఆధారంగా.. ప్లంబర్ అయిన నేను ఈ బీర్ బాటిల్ దాచాను అని ఉంది. అయితే, ప్లంబర్‌ను ఎందుకు దాచిపెట్టారనే సమాచారం అందుబాటులో లేదు.

‘ఈ బాటిల్‌ను 3/25/55న ప్లంబర్ ఇక్కడ దాచిపెడుతున్నాడు..అని బాటిల్ లేబుల్‌పై రాసి ఉన్న సందేశం. ఇది 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. కానీ, బీర్ బాటిల్ పరిమిత కాలానికి మాత్రమే మంచిది. అందువల్ల, దీని వెనుక ఎటువంటి కారణం లేదన్నారు సంబంధిత నిపుణులు. అయితే, ఈ కథనాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక్కడ ప్లంబర్ బీరు తాగి ఇలాంటి పని చేశాడా? అనే సందేహం కూడా చాలా మంది వ్యక్తం చేశారు. పురాతన బీర్‌ బాటిల్‌ మెసేజ్‌పై చాలా మంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.

ఇకపోతే, గుంథర్ బీర్ బాటిల్. గున్థర్ బీర్ బ్రూవరీ కంపెనీ 1900లలో ప్రారంభించబడింది. ఇది అమెరికాలో రెండవ అతిపెద్ద బ్రూవరీ కంపెనీ.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..