Viral Video: నీది మాములు తెలివికాదురా అయ్యా.. చేపలు ఇలా కూడా పడతారా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

|

Sep 23, 2022 | 1:04 PM

సెలవు దినాల్లో లేదా వీకెండ్స్‌తో చాలామంది తమకు ఇష్టమైన అభిరుచులపై దృష్టి సారిస్తారు. రోమింగ్‌ లేదా షాపింగ్‌ చేస్తూ వీకెండ్స్‌ను ఎంజాయ్‌ చేస్తారు. అయితే విదేశాల్లో మాత్రం కొందరు సమయం దొరికితే సరదాగా ఫిషింగ్‌కు బయలుదేరుతారు.

Viral Video: నీది మాములు తెలివికాదురా అయ్యా.. చేపలు ఇలా కూడా పడతారా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Fishing
Follow us on

Funny Video: పరుగులు పెడుతోన్న ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీగా మారిపోయారు. ఎప్పుడో కానీ తీరిక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో లేదా వీకెండ్స్‌తో చాలామంది తమకు ఇష్టమైన అభిరుచులపై దృష్టి సారిస్తారు. రోమింగ్‌ లేదా షాపింగ్‌ చేస్తూ వీకెండ్స్‌ను ఎంజాయ్‌ చేస్తారు. అయితే విదేశాల్లో మాత్రం కొందరు సమయం దొరికితే సరదాగా ఫిషింగ్‌కు బయలుదేరుతారు. సాధారణంగా సముద్రం, నది, చెరువు, కాలువల ఒడ్డున కూర్చుని ప్రశాంతంగా చేపలు పట్టడం మనం చూసే ఉంటాం. ఒక్కోసారి వారి వలలకు భారీ చేపలు దొరకడం, వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరలవడం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా ఫిషింగ్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఎందుకంటే ఇందులోని వ్యక్తి అపార్ట్‌మెంట్‌ బాల్కానీ నుంచి చేపలు పడుతున్నాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో షేర్ చేసినప్పటికీ ఆ తర్వాత పలు సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారమ్‌లలో కూడా కనిపించింది. ఇప్పుడు రీల్ లైఫ్‌స్టైల్ ఫిషింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి తన అపార్ట్‌మెంట్ ముందు ప్రవహించే చిన్న నదిలో చేపలు పట్టాడు. ఇందుకోసం తన ఇంటి బాల్కనీలో నిల్చొని ఎర వేస్తున్నాడు. కాగా అంత ఎత్తులో ఉన్నప్పటికీ ఇతని గాలానికి చేపలు బాగానే దొరుకుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. అలాగే లక్షలాది లైకులు, కామెంట్లు కూడా వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..