ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో తెలియదు.., అది మనిషి అయినా, జంతువు అయినా లేదా కీటకం అయినా సరే. కీటకాలతో ప్రేమలో పడిన ఓ వ్యక్తి వాటిని ముద్దుకూడా పెడుతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే.. ఇప్పటి వరకు ఎవరూ కీటకాన్ని ముద్దుపెట్టుకోవడం చూసుండరు. కానీ ఒక వ్యక్తి కీటకాలను ముద్దు పెట్టుకోవటం చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకోసం అతడు ఓ ప్రత్యేక పరికరాన్ని సిద్ధం చేసుకున్నాడు. కీటకాలతో ప్రేమలో పడిన వ్యక్తి వాటిని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం..
అతని పేరు జస్టిన్, అతడు కీటకాల ప్రేమికుడు. వాటిని ముద్దుపెట్టుకోవటం కోసం అతడు ప్రత్యేక పరికరాన్ని తయారు చేసుకున్నాడు. ఈ పరికరానికి బగ్కిస్ అని పేరు పెట్టాడు. వింతగా అనిపిస్తుంది కదూ..! నవ్వుకుంటున్నారు కదా..! కానీ జస్టిన్ ఈ పరికరం సహాయంతో కీటకాలపై ముద్దుల వర్షం కురిపించాడు. జస్టిన్ తన టిక్ టాక్ ఖాతా ద్వారా దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.
34 ఏళ్ల జస్టిన్ కీటకాలను ముద్దుపెట్టుకునే విచిత్రమైన పరికరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, అతను దానిని ఎలా ఉపయోగించాలో కూడా వివరించాడు. బగ్‌కిస్‌ని ఉపయోగించడానికి సరైన మార్గం.. సిలికాన్ ఎర ముక్కను వెనుక భాగంలో పట్టుకుని, ఆపై కీటకం వైపు చిన్నపెదాలను ముద్దాడటం. జస్టిన్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ సాధనం నిజంగా అద్భుతమైనది.
టిక్‌టాక్‌లో పంచుకున్న ఒక వీడియోలో ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లతో నేరుగా చూడకూడదు. జస్టిన్ ఒక కీటకాన్ని ముద్దుపెట్టుకునేటప్పుడు దానిని కంటితో చూడకూడదు. ఎందుకంటే అది భయపెట్టవచ్చు. చీమల నుంచి సీతాకోక చిలుకలు, పాముల వరకు ఈ పరికరం ద్వారా ముద్దుపెట్టుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..