Video Viral: అంత తొందరెందుకు బ్రదరూ.. వాళ్లు లేకపోతే పరిస్థితి ఏమయ్యోదో ఓ సారి ఆలోచించుకో..

|

Sep 24, 2022 | 12:55 PM

దేశ రవాణా వ్యవస్థలో రైల్వేస్ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే.. అప్పుడప్పుడు జరిగే రైలు...

Video Viral: అంత తొందరెందుకు బ్రదరూ.. వాళ్లు లేకపోతే పరిస్థితి ఏమయ్యోదో ఓ సారి ఆలోచించుకో..
Train Accident
Follow us on

దేశ రవాణా వ్యవస్థలో రైల్వేస్ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే.. అప్పుడప్పుడు జరిగే రైలు ప్రమాదాలు తీవ్ర విషాదం కలిగిస్తాయి. వీటిలో కొన్ని మానవ తప్పిదాల వల్ల కూడా జరుగుతుంటాయి. పట్టాలు దాటడం, రన్నింగ్ ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం వంటివి చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అందుకే రైలు ఎక్కేటప్పుడు గానీ, దిగేటప్పుడు గానీ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అయితే.. కొందరు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా యథేచ్చగా రైలు పట్టాలు దాటడం, ప్రయాణిస్తున్న రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు అదుపుతప్పి కింద పడిపోయి ప్రమాదాలకు గురవుతుంటారు. అంతే కాకుండా కొన్ని ఘటల్లో ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఇంటర్నెట్ కారణంగా ఇలా జరుగుతున్న రైలు ప్రమాదాల వీడియోలు చాలానే ఉన్నాయి. కొంత వరకు ఇవి ప్రమాదాలను తగ్గించడంలో సహాహయపడతాయి. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అనే ఆలోచన ప్రయాణీకుల్లో కచ్చితంగా కలుగుతుంది.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్లాట్‌ఫారమ్‌కు, రైలుకు మధ్య ఉన్న గ్యాప్‌లో ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫారమ్‌పై రాత్రి 11.15 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన RPF సిబ్బంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతనిని సురక్షితంగా కాపాడారు. ఆ ప్రయాణికుడిని సేలం జిల్లాలోని మెట్టూరు ప్రాంతానికి చెందిన శివకుమార్‌గా గుర్తించారు. కదులుతున్న కన్నూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నుండి కిందకు దిగేందుకు ప్రయత్నించగా అతను బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య పడిపోయాడు. శివకుమార్‌ను సురక్షితంగా కాపాడిన తర్వాత వైద్య చికిత్స కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రాణాలకు తెగించి ప్రయాణీకుడిని కాపాడిన రైల్వే సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. అంతే కాకుండా వీడియోను ఎక్కువ సార్లు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్లిప్ చూసిన తర్వాత..తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..