Viral: ఛీ.. ఆ యువతికి ఇదేం పాడు అలవాటు.. సీక్రెట్ తెలిసి షాకైన ప్రియుడు.!
చిన్నప్పటి నుంచి ఎంతోమందికి ఎన్నో అలవాట్లు ఉండి ఉంటాయి. వాటిల్లో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు అయితే..
చిన్నప్పటి నుంచి ఎంతోమందికి ఎన్నో అలవాట్లు ఉండి ఉంటాయి. వాటిల్లో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు అయితే.. మరికొన్ని పెద్దవుతున్న కొద్దీ అలవరుచుకునే అలవాట్లు కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ వింటే మీరు ఆశ్చర్యపోతారంతే.! ఇక్కడొక యువతికి చిన్నప్పటి నుంచి సాక్స్ తినడం అలవాటు. ఏంటి సాక్స్ తినడమా.? ఛీ.. ఇదేం పాడు అలవాటు.! అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ.! చాలామందికి సాక్స్ వాసన అంటేనే నచ్చదు. అయితే ఈ అమ్మాయి మాత్రం వాటిని నోట్లో పెట్టుకుని నములుతుందట. క్రమేపీ పెద్దయ్యాక ఆ అలవాటును ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడింది. అయితే ఇటీవల ఆమె సీక్రెట్ కాస్తా తన బాయ్ ఫ్రెండ్‌కు తెలిసింది. అంతే! అతడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నాడు.
ప్రతీ రోజూ రాత్రి తన బాయ్ ఫ్రెండ్ నిద్రపోయిన అనంతరం ఈ యువతి సాక్స్ నములుతోందట. ఇలా తన సీక్రెట్‌ను బయటపడకుండా జాగ్రత్తపడింది సదరు యువతి. అయితే ఒకానొక రోజు రాత్రి ఆమె సాక్స్ నములుతూ తన బాయ్ ఫ్రెండ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసింది. దీనితో అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కొన్ని వారాల అనంతరం ఈ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించగా.. సదరు యువతి తాను ఏం చేయలేదన్నట్లుగా సమర్ధించుకుంది. కొంచెం గట్టిగా అడిగేసరికి అలిగి తనతో మాట్లాడటం మానేసిందట. ఇక ఈ విషయాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కాగా అతడు పెట్టిన పోస్టుపై వరుసపెట్టి కామెంట్స్ హోరెత్తాయి. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.