Viral Video: ఉధృతంగా ప్రవహిస్తోన్న నదిని కారులో దాటిన ఓ వ్యక్తి.. అది కారు.. పడవ కాదంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో

|

Sep 25, 2022 | 6:22 PM

నది ప్రవాహం ఎంత వేగంగా ఉందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఒక వ్యక్తి తన కారును ఆ ప్రవాహానికి మధ్య నుంచి తీసుకుని వెళ్ళాడు. కారు సహాయంతో ప్రవహిస్తున్న నదిని దాటున్నాడు.

Viral Video: ఉధృతంగా ప్రవహిస్తోన్న నదిని కారులో దాటిన ఓ వ్యక్తి.. అది కారు.. పడవ కాదంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో
Video Viral
Follow us on

Viral Video: ప్రవహించే నది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. అంతే ప్రమాదకరం. ఈత రాని వారు పొరపాటున కూడా నదిలోకి దిగకూడదు.  లేకుంటే అది ఎక్కడికి తీసుకెళుతుందో, ఎక్కడ మునిగి తెలుస్తుందో ఎవరికీ తెలియదు.  అయినప్పటికీ చాలా ప్రజలు నది ఒడ్డున సరదాగా గడుపడానికి ఇష్టపడతారు. ప్రాణాలను పణంగా పెట్టి తమ వాహనాలను నదిలో నడుపుతూ తీసికెళ్ళివారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి ప్రవహించే నదిని కారు తో సహా దాటుతున్నట్లు కనిపిస్తుంది.

నది ప్రవాహం ఎంత వేగంగా ఉందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఒక వ్యక్తి తన కారును ఆ ప్రవాహానికి మధ్య నుంచి తీసుకుని వెళ్ళాడు. కారు సహాయంతో ప్రవహిస్తున్న నదిని దాటున్నాడు. ఇలా చేస్తున్న సమయంలో కారు ప్రవాహానికి ఎదురీదుతోంది. నది ఉధృతి.. కారుని తమతో తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించింది.  కానీ కారు డ్రైవర్ ఎక్కడా తొణకకుండా.. బెణకకుండా నెమ్మదిగా కారుని డ్రైవ్ చేస్తూ.. చాకచక్యంగా ప్రవహిస్తున్న నదిని దాటుడు.   నిజానికి ఉధృతిగా ప్రవహిస్తున్న నదిని ఈదుతూ డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. ప్రమాదం జరిగే ఆవకాశం చాలా ఎక్కువ. కారుతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇటువంటి రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. లేకుంటే అది ప్రాణాంతకం కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో planetarth_ పేరుతో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 20 లక్షల వ్యూస్ ను 31 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు కారు డ్రైవర్‌  ‘ధైర్యవంతుడు’ అని, అంటే..  మరి కొందరు ఇదేం పిచ్చి అని అంటున్నారు. మరి కొందరు ఈ ప్రమాదకరమైన దృశ్యం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. ఒకరు.. అసలు ‘ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు… అది కారు పడవ కాదు’ అని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..