ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము.. అలా నోట్లో పెట్టేసుకున్నావ్..

|

May 19, 2024 | 1:17 PM

ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు ఒక ఎత్తయితే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మరో ఎత్తు. ముఖ్యంగా సింహం, మొసలి, పులి, చిరుత వేటాడే వీడియోలపై క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఇక పాములకు సంబంధించింది అయితే..

ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము.. అలా నోట్లో పెట్టేసుకున్నావ్..
Viral Video
Follow us on

ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు ఒక ఎత్తయితే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మరో ఎత్తు. ముఖ్యంగా సింహం, మొసలి, పులి, చిరుత వేటాడే వీడియోలపై క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఇక పాములకు సంబంధించింది అయితే.. కోకొల్లలు. సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే అందరూ దడుసుకుంటారు. అలాంటిది ఆ పాము దగ్గరకు వస్తే.. గుండె ఆగినంత పనవుతుంది. ఇక ఇప్పుడు పాముకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఓ మనిషి చేసిన చర్యను చూస్తే.. అస్సలు వాడు మనిషేనా అన్నట్టు అనిపిస్తుంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బురదలో పని చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. ఇక అటుగా ఓ పాము వెళ్తుండగా.. అతడు చూశాడు. ఎవరైనా పాము కనిపిస్తే.. ఏం చేస్తారు.. ఠక్కున అక్కడ నుంచి ఎగిరి పక్కకు వెళ్లిపోతారు. అయితే అతడు మాత్రం దానిని రెండు చేతులతో పట్టుకుని.. ఆ పామును తన నోట్లో పెట్టుకుని పళ్లతో కొరికి పక్కకు విసిరేస్తాడు. ఇదేం పెద్ద విషయం కాదన్నట్టు ప్రవర్తించాడు. ఈ ఘటనను అక్కడున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది అది దెబ్బకు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

Also Read: పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..