Viral Video: పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది.. ఆ తర్వాత..

ఎంతటి సాధు స్వభావులైనప్పటికీ వారిలోనూ ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇది మనుషుల స్వభావం.. ఇక జంతువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే సాధారణంగా ఆవులను సాధు జంతువులుగా మనం చూస్తాం. కానీ ఎంత సాధుజీవులు అయినా ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందనే..

Viral Video: పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది.. ఆ తర్వాత..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 19, 2024 | 12:25 PM

ఎంతటి సాధు స్వభావులైనప్పటికీ వారిలోనూ ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇది మనుషుల స్వభావం.. ఇక జంతువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే సాధారణంగా ఆవులను సాధు జంతువులుగా మనం చూస్తాం. కానీ ఎంత సాధుజీవులు అయినా ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందనే విషయం మరోసారి నిరూపణ అయింది. ఢిల్లీలోని ఓ వీధిలో పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో ముగ్గురు యువతులు ఓ షాప్ బయట స్నాక్స్‌ తింటున్నారు. వారిలో ఇద్దరు కూర్చోగా మరో యువతి నిలబడింది. ఇంతలో హఠాత్తుగా రెండు ఆవులు కుమ్ముకుంటూ వారిపైకి దూసుకెళ్లాయి. దీంతో వారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. అయినా ఆవులు ఆగకుండా కుమ్ముకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఆవు గిట్టలకింద ఓ యువతి చిక్కుకుపోయింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించారు. ఒకరు ఆవులను చెదరగొట్టగా మరొకరు కిందపడ్డ యువతిని పైకిలేపి పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సకాలంలో స్పందించిన యువకులను ప్రశంసించారు. అలాగే రోడ్లపై ఆవులు తిరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మంది వీక్షించారు. వీడియోపై తమదైనశైలిలో స్పందించారు.

Also Read: పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్