ప్రమాదం ఎప్పుడు.. ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం చాలా కష్టం. పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే నమ్మకం లేకుండా పోయింది. కొందరు నిర్లక్ష్యంగా చేసే డ్రైవింగ్.. ఇతరుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. రెప్పపాటులో జరిగే ఘోర రోడ్డు ప్రమాదాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు చేసే నిర్లక్ష్య డ్రైవింగ్ ఇతరుల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇటీవల భయాంకరమైన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రమాదకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తుండగానే ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లో వేవ్ సిటీలో జరిగింది.
కేవీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘజియాబాద్‌లోని వేవ్ సిటీలో ఓ బైకర్ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అతను రోడ్డు దాటుతున్న సమయంలో మరో సైడ్ నుంచి వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకోట్టడంతో ఆ బైకర్ గాల్లోకి ఎగిరి పల్డీలు కొట్టి కింద పడ్డాడు. ఈ భయంకరమైన ప్రమాదఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన బైకర్ ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కవినగర్ పోలీసులు తెలిపారు.
#Ghaziabad road accident. Bike and car collision. After the collision, the bike rider jumped high from the roof of the car and fell on the road. condition critical pic.twitter.com/MRnESjwege
— Satya Tiwari (@SatyatTiwari) April 22, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Acharya Pre Release Event: మెగా సందడి షూరు.. ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..
Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..