Viral Video: బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌తో చెత్త సేకరణ ఎనౌన్స్‌.. మట్టిలో మాణిక్యం అంటున్న నెటిజన్లు

అతనిలో అద్భుత గాయకుడు ఉన్నాడని అతనికి తెలియదు.. పనీ...పాట అన్నట్టుగా అలా పాడుకుంటూ వెళ్తున్నాడు. అతను 2003లో వచ్చిన స‌ల్మాన్ ఖాన్ మూవీ తేరే నామ్‌లోని సూప‌ర్ హిట్ సాంగ్‌ 'క్యోం కిసీ కో' పాటను ఎంతో శ్రావ్యంగా పాడాడు.

Viral Video: బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌తో చెత్త సేకరణ ఎనౌన్స్‌.. మట్టిలో మాణిక్యం అంటున్న నెటిజన్లు
Viral Video

Updated on: Feb 10, 2023 | 1:16 PM

పనీ పాటా..అనే నానుడి అందరికీ తెలిసిందే…భారతదేశంలో ప్రతిభకు కొదవలేదని నిరూపించే ఎన్నో ఘటనలు ఉన్నాయి. సోషల్‌ మీడియా పుణ్యమా అని అలాంటి ఎందరో నైపుణ్యం కలిగిన మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. వారి అదృష్టమో.. కాల ప్రభావమో కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిపోయారు.. ఇంకా ఎందరో అలాంటి ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉన్నారు. తాజాగా మరో మట్టిలో మాణిక్యం నెట్టింట ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో అతని చేతిలో ఓ మైక్‌ ఉంది. ఆ మైక్‌లో తాను వచ్చినట్టుగా అందరికీ సూచిస్తూ ఎనౌన్స్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను మధ్యమధ్యలో పాటలు పాడుతున్నాడు. కానీ అతనిలో అద్భుత గాయకుడు ఉన్నాడని అతనికి తెలియదు.. పనీ…పాట అన్నట్టుగా అలా పాడుకుంటూ వెళ్తున్నాడు. అతను 2003లో వచ్చిన స‌ల్మాన్ ఖాన్ మూవీ తేరే నామ్‌లోని సూప‌ర్ హిట్ సాంగ్‌ ‘క్యోం కిసీ కో’ పాటను ఎంతో శ్రావ్యంగా పాడాడు. ఈ సినిమాలోని పాట‌లు అప్పట్లో ఎంతో పాపుల‌ర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చేతిలో మైక్రోఫోన్‌తో పాత పాట‌ను అత‌డు ఆల‌పించ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియోను ఆ సినిమా డైరెక్ట‌ర్ స‌తీష్ కౌశిక్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాలోని పాటలపై అంతే ప్రేమ చూపించండం గర్వంగా ఉందంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. అప్పట్లో మూవీలో ఉదిత్‌ నారాయణ్‌ ఆ పాటను ఆలపించారు. ఇప్పుడు మళ్లీ ఈ వ్యక్తి గొంతులో అంతే శ్రావ్యంగా పలికింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడయోను ఇప్పటికే 34 వేలమంది వీక్షించారు. పాట పాడిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. సానపెట్టని నైపుణ్యం అని ఒకరంటే.. భారత్‌లో నైపుణ్యాలకు కొదవే లేదని మరొకరన్నారు. ఇంకొకరైతే సినిమాను మళ్ళీ రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ను కోరారు.

మరిన్ని టెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..