
నోటిలో టూత్‌పిక్‌ను పెట్టుకుని మర్చిపోయి నిద్రపోయిన ఒక వ్యక్తి మరుసటి రోజు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. 29 ఏళ్ల వ్యక్తి రోజంతా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ.. అసలు అదెందుకు వచ్చిందో తెలియక సతమతంయ్యాడు. ముందు రోజు రాత్రి అతడు డిన్నర్‌లో నోరూరించే చికెన్ తిన్నాడు. ఆ తర్వాత కడుపు ఉబ్బి.. పొత్తికడుపులో నొప్పి రావడం తీవ్రమైందని డాక్టర్లతో చెప్పాడు. వాళ్లు సదరు రోగికి CT స్కాన్ చేయగా.. 3.7 సెంటీమీటర్లు ఉన్న టూత్‌పిక్ ఒకటి అతడి కడుపులో ఉన్నట్టు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా ఆ టూత్‌పిక్.. పేగులను చిల్లులు చేసిందని తేల్చారు.
అది ఉన్న ప్రదేశంలో కొంతమేరకు రక్తస్రావం జరగ్గా.. స్టెరైల్ స్పాంజ్ ఉపయోగించి దాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని విజయవంతంగా తొలగించారు. సౌదీ అరేబియాలో చికిత్స పొందిన సదరు రోగి, శస్త్రచికిత్స తర్వాత మూడు రోజులకు డిశ్చార్జ్ అయ్యాడు. కాగా, మొదటిగా వైద్యులు చికెన్ వల్ల ఇలా జరిగిందని అనుకున్నారు. అయితే గతంలోని 136 కేసులను పరిశీలించాక టూత్‌పిక్ కారణంగా ఇది జరిగిందని తేల్చారు. దీని వల్ల సంభవించే మరణాల రేటు కేవలం 10 శాతం మాత్రమేనని అన్నారు.