దేశంలో బంగారం ధర ఎక్కడైనా ఒకటే… మలబార్ వారి కొత్త స్కీం… ‘వన్ ఇండియా… వన్ గోల్డ్ రేట్’

|

Nov 19, 2020 | 4:10 PM

కొన్ని ఏళ్లుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తుంటారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు.

దేశంలో బంగారం ధర ఎక్కడైనా ఒకటే...  మలబార్ వారి కొత్త స్కీం... ‘వన్ ఇండియా... వన్ గోల్డ్ రేట్’
Follow us on

కొన్ని ఏళ్లుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తుంటారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. అయితే, మామూలుగా బంగారం ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. రాజధానిలో ఒక రేటు ఉంటే హైదరాబాద్ లో మరో రేట్ పలుకుతుంది. ఇందుకు మార్కెట్ వర్గాలు అనేక కారణాలు చెబుతుంటారు. అయితే, తాజాగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ సంస్థ ఓ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దేశంలోని వారి షాపుల్లో ఖరీదు చేసే బంగారానికి మాత్రమే వర్తిస్తుందని షరతు పెట్టింది. ఇందుకు సంబంధించి ‘వన్ ఇండియా… వన్ గోల్డ్ రేట్’ అనే ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని మలబార్ షోరూమ్‌లలో కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో… దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాపుల్లో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ స్టోర్లలో 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ జువెలరీని కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది. వన్ ఇండియా వన్ గోల్డ్ రేటు స్కీమ్ కింద సంస్థకు చెందిన ఏ దుకాణంలోనైనా ఒకే ధర ఉంటుందని తెలిపారు.