Viral: ఎంత కష్టమొచ్చింది బ్రో.. సిబిల్ స్కోర్ తక్కువని పెళ్లి ఆపేశారు.. ఎక్కడో తెల్సా

పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలూ చూసి ఇవ్వాలనేవారు.. వరుడికి ధూమపానం..మద్యపానం ఇతరత్రా అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు.. కానీ ఈరోజుల్లో ఈ లక్షణాలు కామన్‌ అయిపోయాయి.. ప్రస్తుతకాలంలో.. ఆ వివరాలు

Viral: ఎంత కష్టమొచ్చింది బ్రో.. సిబిల్ స్కోర్ తక్కువని పెళ్లి ఆపేశారు.. ఎక్కడో తెల్సా
Marriage

Updated on: Feb 08, 2025 | 1:53 PM

పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలూ చూసి ఇవ్వాలనేవారు.. వరుడికి ధూమపానం..మద్యపానం ఇతరత్రా అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు.. కానీ ఈరోజుల్లో ఈ లక్షణాలు కామన్‌ అయిపోయాయి.. ప్రస్తుతకాలంలో.. వరుడి ప్యాకేజీ ఎంత? అతడి బ్యాంక్‌ బ్యాలన్స్‌ ఎంత ఉంది? వధువు ఏం చదువుకుంది..ఎంత సంపాదిస్తుంది? అనేవి చూడ్డం తప్పనిసరి అయిపోయాయి. ఇలాంటి వివాహాలు బంధాలు అనుబంధాలమీద కాకుండా బ్యాంకు బ్యాలెన్స్‌లు..ప్యాకేజీలపై ఆధారపడి సాగుతున్నాయనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి వివాహం అతని సిబిల్‌ స్కోరు కారణంగా క్యాన్సిల్‌ అయిపోయింది.

మీడియా కధనాల ప్రకారం.. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. వివాహానికి కావాల్సిన అన్ని విషయాలు మాట్లాడుకొని ముహూర్తం సైతం ఫిక్స్‌ చేసుకున్నారు. అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సిబిల్‌ స్కోర్‌ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు. ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు. అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మాయిలకు వివాహం చేయాలంటే తప్పకుండా అన్ని విషయాలు చెక్‌ చేయాలని అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించగలమని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి